లండన్ : క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదైంది. క్రికెట్ అంటే బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం అనే వారందరు ఈ మ్యాచ్ గణంకాలను పరిశీలిస్తే ముక్కున వేలేయాల్సిందే! అవును మరి అంతలా విలవిలాడిపోయారు బ్యాట్స్‌మెన్. 11.2 ఓవర్లాడి కేవలం 18 పరుగులకే చాపచుట్టేసారంటే బౌలర్లు ఎంత బెంబేలెత్తించారో అర్థమవుతోంది. షెఫర్డ్ నీమ్ కెంట్ క్రికెట్ లీగ్‌లో భాగంగా.. బెకెన్‌హామ్ సీసీ, బెక్స్‌లీ సీసీల మధ్య గత శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది. తొలుత టాస్ గెలిచిన బెకెన్‌హామ్ సీసీ బ్యాటింగ్‌కు దిగి 18 పరుగులకే కుప్పకూలింది.
ఇందులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కాగా.. ముగ్గురు సింగిల్ మాత్రమే సాధించడం విశేషం. స్కాట్లాండ్ తరఫున 57 అంతర్జాతీయ వన్డేలు ఆడిన కాలమ్ మెక్‌లియోడ్ బెక్స్‌లీ తరపున 6 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెక్స్‌లీ జట్టు 12 నిమిషాల్లో ఛేదించింది. దీంతో 61 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఈ దెబ్బకు 152 ఏళ్ల ఈ క్లబ్ చరిత్రలో అత్యంత తక్కువ స్కోరు నమోదు కావడమే కాకుండా లీగ్‌లోనూ ఇదే అత్యల్పం కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మ్యాచ్ విశేషాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment