Canada Masters Tournament: 61 Year Old Kevin Watson Set To Play In England Seniors Squad - Sakshi
Sakshi News home page

61 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టులోకి ఎంట్రీ

Published Fri, Aug 18 2023 3:39 PM | Last Updated on Fri, Aug 18 2023 4:40 PM

61 Year Old Kevin Watson Set To Play In England Seniors Squad - Sakshi

61 ఏళ్ల లేటు వయసులో ఓ పెద్దాయన ఇంగ్లండ్‌ సీనియర్‌ క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. త్వరలో జరుగనున్న కెనడా మాస్టర్స్‌ టోర్నీ కోసం సెలెక్టర్లు ఈ ఔత్సాహికున్ని ఇంగ్లండ్‌ సీనియర్‌ జట్టుకు ఎంపిక చేశారు. ఎప్పటికైనా ఇంగ్లండ్‌ జెర్పీ ధరించి, జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్న ఈ పెద్దాయన.. ఎట్టకేలకు జీవిత చరమాంకంలో తన కలను సాకారం చేసుకున్నాడు.

ఇంతకీ ఆ లేటు వయసు క్రికెటర్‌ ఎవరనుకుంటున్నారా..? అతని పేరు కెవిన్‌ వాట్సన్‌. వెస్ట్‌ యార్క్‌షైర్‌కు చెందిన ఇతను.. తన క్రికెట్‌ ప్రస్తానాన్ని 15 ఏళ్ల వయసులోనే ప్రారంభించాడు. వాట్సన్‌ గతంలో యార్క్‌షైర్‌ కౌంటీకి సారథ్యం కూడా వహించాడు. ఇటీవలే అతను ఆస్ట్రేలియా-ఏతో జరిగిన గ్రే యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌-ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

జాతీయ జట్టు జెర్సీ ధరించాలని బలమైన వాంఛ కలిగిన వాట్సన్‌.. తన 61వ ఏట ఆ కలను నేరవేర్చుకున్నాడు. ఇంగ్లండ్‌ సీనియర్‌ జట్టుకు ఎంపికైనానని తెలిసి వాట్సన్‌ ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఈ వార్త వింటుంటే చంద్రుడిపై విహరిస్తున్న అనుభూతి కలుగుతుందని అన్నాడు. 

కాగా, మొత్తం నాలుగు జట్లు పాల్గొనే కెనడా మాస్టర్స్‌ టోర్నీలో ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ, కెనడా జట్లు పాల్గొననున్నాయి. శనివారం నయాగరా ఫాల్స్‌లో జరిగే వార్మప్‌ మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం‍కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement