ఆక్లాండ్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డు సాధించాడు. అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన కివీస్ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న డే–నైట్ టెస్టులో అతడు ఈ రికార్డు లిఖించాడు. టెస్టు కెరీర్‌లో 18వ శతకం నమోదు చేశాడు. 220 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 102 పరుగులు చేసి అవుటయ్యాడు.
తాజా శతకంతో మార్టిన్ క్రోవ్, రాస్ టేలర్‌ను విలియమ్సన్ అధిగమించాడు. వీరిద్దరూ 17 టెస్టు సెంచరీలు చేశారు. క్రోవ్, టేలర్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం. 114 ఇన్నింగ్స్‌లోనే 18వ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. క్రోవ్ 120 ఇన్నింగ్స్‌లో 17 సెంచరీలు చేయగా, టేలర్ 149 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.
64వ టెస్ట్ ఆడుతున్న విలియమ్సన్ ఇప్పటివరకు 114 ఇన్నింగ్స్ ఆడి 5316 పరుగులు సాధించాడు. ఇందులో 18 సెంచరీలు, 26 అర్ధసెంచరీలు ఉన్నాయి. 28 ఏళ్ల విలియమ్సన్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment