దుబాయ్: ముంబై ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా హవా ఇండియన్ ప్రీమియర్‌లో లీగ్‌లో కొనసాగుతోంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో గురువారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో సత్తా చాటి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డు కెక్కాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 27 వికెట్లు పడొట్టాడు. తనకు వికెట్లు దక్కపోయినా ఫర్వాలేదని, గెలవడమే ముఖ్యమని ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన తర్వాత బుమ్రా వ్యాఖ్యానించాడు. తొందరగా వికెట్లు పడగొట్టడంపైనే దృష్టి పెట్టానని, అంతిమ ఫలితం గురించి ఎప్పుడూ ఆలోచించనని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న తర్వాత చెప్పాడు.
బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన ఇదే..
ఢిల్లీతో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 4 వికెట్లు దక్కించుకున్నాడు. టి20ల్లో బుమ్రాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడబం విశేషం. ఇదే ఐపీఎల్‌లో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అతను నమోదు చేసిన 4/20ని సవరించాడు. (చెలరేగిన బుమ్రా: ఫైనల్లో ముంబై)
హైలైట్స్..
► ఐపీఎల్‌లో ముంబై ఫైనల్ చేరడం ఇది ఆరో సారి. 2010లో మినహా మిగతా నాలుగు సార్లు (2013, 2015, 2017, 2019) విజేతగా నిలిచింది.
► జట్టులో టాప్–3 డకౌట్ కావడం ఐపీఎల్‌లో ఇది రెండో సారి. 2009లో డక్కన్ చార్జర్స్ ఆటగాళ్లు ఇలా అవుటయ్యారు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు (సీజన్ల వారీగా)
2019: ఇమ్రాన్ తాహిర్ (చెన్నై సూపర్ కింగ్స్): 26 వికెట్లు
2018: ఆండ్రూ టై (కింగ్స్ ఎలెవన్ పంజాబ్): 24 వికెట్లు
2017: భువనేశ్వర్ కుమార్(సన్‌రైజర్స్ హైదరాబాద్): 26 వికెట్లు
2016: భువనేశ్వర్ కుమార్(సన్‌రైజర్స్ హైదరాబాద్): 23 వికెట్లు
2015: డ్వెన్ బ్రావో (చెన్నై సూపర్ కింగ్స్): 26 వికెట్లు
2014: మొహిత్ శర్మ (చెన్నై సూపర్ కింగ్స్): 23
2013: డ్వెన్ బ్రావో (చెన్నై సూపర్ కింగ్స్): 32 వికెట్లు
2012: మోర్ని మోర్కల్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్): 25 వికెట్లు
2011: లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్): 28 వికెట్లు
2010: ప్రజ్ఞాన్ ఓజా ( హైదరాబాద్ డక్కన్ చార్జర్స్): 21 వికెట్లు
2009: ఆర్పీ సింగ్ ( హైదరాబాద్ డక్కన్ చార్జర్స్): 23 వికెట్లు
2008: సొహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్): 22 వికెట్లు)
Comments
Please login to add a commentAdd a comment