
టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని తెలుస్తుంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు విశ్రాంతి కల్పించనున్నారని సమాచారం.
రెండో టెస్ట్‌లో బుమ్రా నాలుగు రోజుల పాటు 32 ఓవర్లు వేసి అలసిపోయాడని సెలెక్టర్లు భావిస్తున్నారట. అందుకే అతనికి పాక్షిక విరామం ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బుమ్రాను తిరిగి చివరి రెండు టెస్ట్‌లకు జట్టులోకి ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతుంది.
బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ టీమిండియా బౌలింగ్ అటాక్‌కు లీడ్ చేస్తాడని సమాచారం. వర్క్‌లోడ్ కారణంగానే సిరాజ్‌ను సైతం రెండో టెస్ట్‌కు దూరంగా ఉంచారు. మూడో టెస్ట్‌లో సిరాజ్, ముకేశ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.
కాగా, విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో బుమ్రా మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జస్సీ 91 పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన కారణంగా బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రకటించబడ్డాడు.
బుమ్రాతో పాటు యశస్వి జైస్వాల్ (209), శుభ్‌మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో చెలరేగడంతో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. మూడో టెస్ట్‌కు భారత జట్టును రేపు ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment