
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే చివరాఖరి (ఐదు) టెస్ట్ కోసం అప్‌డేట్ చేసిన భారత్ జట్టును ఇవాళ (ఫిబ్రవరి 29) ప్రకటించారు. నాలుగో టెస్ట్‌కు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చాడంటే తుది జట్టులో అతని స్థానం ఖరారైనట్లే.
బుమ్రా.. ఆకాశ్‌దీప్‌తో కలిసి భారత పేస్ బౌలింగ్ దళాన్ని లీడ్ చేస్తాడు. బుమ్రా పునరాగమనంతో నాలుగో టెస్ట్‌లో ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయిన సిరాజ్‌పై వేటు పడే అవకాశం ఉంది. ధర్మశాల పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుండటంతో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం లేదు.
🚨 NEWS 🚨#TeamIndia's squad for the 5th @IDFCFIRSTBank Test against England in Dharamsala announced.
— BCCI (@BCCI) February 29, 2024
Details 🔽 #INDvENG https://t.co/SO0RXjS2dK
భారత తుది జట్టు విషయానికొస్తే.. నాలుగో టెస్ట్‌లో ఆడిన జట్టులో రెండు మార్పులకు ఆస్కారం ఉంది. వరుసగా మూడు టెస్ట్‌ల్లో విఫలమైన రజత్ పాటిదార్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్ తుది జట్టులోకి రావచ్చు. సిరాజ్ ప్లేస్‌లో బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైపోయింది. ఐదో టెస్ట్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి, అశ్విన్‌కు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం జరిగింది.
ధర్మశాల టెస్ట్ అశ్విన్‌కు 100వ టెస్ట్ మ్యాచ్ కావడంతో ఇది నిజమేనని అంతా అనుకున్నారు. అయితే ఈ ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. రోహిత్ అప్‌డేట్ చేసిన జట్టులో ఉన్నాడంటే తుది జట్టులో ఉన్నట్లే. మొత్తంగా చూస్తే బుమ్రా రీఎంట్రీ మినహా ఐదో టెస్ట్ కోసం ప్రకటించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
ఐదో టెస్ట్ కోసం అప్‌డేట్ చేసిన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), దేవదత్ పడిక్కల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మొమమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్
ఐదో టెస్ట్‌లో భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శస్వి జైస్వాల్, శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆకాష్ దీప్