న్యూయార్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విషయంలో తను రెండుసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు మాజీ అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించారు. ఈ విండీస్ అంపైర్ రిటైరైన 11 ఏళ్ల తర్వాత తన పొరపాటును ఒప్పుకోవడం గమనార్హం. భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఓ సారి సచిన్ ఎదుర్కొన్న బంతి ఎత్తులో వెళ్తున్నప్పటికీ ఎల్బీగా ఇచ్చానని, అలాగే భారత్‌లోని ఈడెన్ గార్డెన్స్‌లో అతని బ్యాట్‌కు బంతి తగలకపోయినా క్యాచ్ ఔట్ ఇచ్చానని చెప్పారు. అప్పుడు స్టేడియంలో ఉన్న లక్ష మంది తన తప్పుడు నిర్ణయంపై గగ్గోలు పెట్టారని ఆయన నాటి ఘటనను వివరించారు. ఈ రెండు మానవ తప్పిదాలని బక్నర్ చెప్పుకొచ్చారు. 2009లో రిటైరయ్యాక బక్నర్ న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. ప్రపంచ క్రికెట్‌లో సచిన్, లారా మేటి బ్యాట్స్‌మెన్ అని కితాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment