
ముంబై: సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 మ్యాచ్‌లో అదరగొట్టాడు. ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదువికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసుకున్న లెఫ్టార్మ్ సీమర్ అర్జున్ రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు బౌలింగ్ చేసి 95 పరుగులిచ్చి ఐదు వికెట్లు దక్కించుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 361 పరుగులు చేయగా.. ముంబై 506 పరుగులతో దీటుగా సమాధానమిచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ 8 వికెట్లకు 411 పరుగులు సాధించగా... మ్యాచ్ ముగిసే సమయానికి ముంబై వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ముంబై మూడు పాయింట్లు సంపాదించింది.