ఫించ్ హిట్టింగ్ | Aaron Finch stars as MCC beat Rest of the World by seven wickets | Sakshi
Sakshi News home page

ఫించ్ హిట్టింగ్

Published Sun, Jul 6 2014 1:28 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

ఫించ్ హిట్టింగ్ - Sakshi

ఫించ్ హిట్టింగ్

145 బంతుల్లో 181 నాటౌట్; 23 ఫోర్లు, 6 సిక్సర్లు
 లండన్: రిటైర్మెంట్ తర్వాత చాన్నాళ్లకు మళ్లీ మైదానంలోకి దిగిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు ఆరోన్ ఫించ్ చక్కటి కానుక ఇచ్చాడు. రెస్టాఫ్ ద వరల్డ్ ఎలెవన్‌తో శనివారం జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఫించ్ (145 బంతుల్లో 181 నాటౌట్; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ సెంచరీతో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. లార్డ్స్ మైదానం ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎంసీసీని గెలిపించి... సచిన్‌తో కలిసి ఆడిన మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన షేన్ వార్న్ సారథ్యంలోని రెస్టాఫ్ ద వరల్డ్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగుల భారీస్కోరు సాధించింది.
 
 యువరాజ్ సింగ్ (134 బంతుల్లో 132; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. సెహ్వాగ్ (22) ఫర్వాలేదనిపించాడు. ఎంసీసీ బౌలర్లలో సయీద్ అజ్మల్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యాన్ని ఎంసీసీ జట్టు 45.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 296 పరుగులు చేసి ఛేదించింది. సచిన్ (45 బంతుల్లో 44; 7 ఫోర్లు) రాణించాడు. ద్రవిడ్ (0) నిరాశపరిచాడు.
 
 సంక్షిప్త స్కోర్లు: రెస్టాఫ్ వరల్డ్: 50 ఓవర్లలో 293/7 (యువరాజ్ 132, కాలింగ్‌వుడ్ 40, సెహ్వాగ్ 22, పీటర్సన్ 10; అజ్మల్ 4/45, బ్రెట్‌లీ 2/55, సచిన్ 1/33): ఎంసీసీ: 45.5 ఓవర్లలో 296/3 (ఫించ్ 181 నాటౌట్, సచిన్ 44; కాలింగ్‌వుడ్ 2/25, మురళీధరన్ 1/55).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement