లండన్: భారత్తో రెండో టెస్టులో గ్యారీ బాలెన్స్ (110) సెంచరీతో రాణించి ఇంగ్లండ్ను ఆదుకున్నాడు. మ్యాచ్ రెండో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఇంకా 76 పరుగులు వెనకబడి ఉంది.
290/9 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 5 పరుగులకు ఆలౌటైంది. ఆండర్సన్ నాలుగు, బ్రాడ్, స్టోక్స్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మొదట్లో తడబడింది. భారత యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లీష్ మెన్కు వణుకు పుట్టించాడు. భువి వరుసగా కుక్, రాబ్సన్, ఇయానె బెల్ను పెవిలియన్కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రూట్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. అయితే ఈ దశలో బాలెన్స్ సంయమనంతో ఆడుతూ ఇంగ్లండ్ను ఆదుకున్నాడు. బాలెన్స్కు కాసేపు అలీ అండగా నిలిచాడు. వీరిద్దరూ వికెట్లు కాపాడుకోవడానికి ప్రాధానమిస్తూ ఆచితూచి ఆడారు. బాలెన్స్ సెంచరీ చేయడంతో స్కోరు 200 దాటింది. అయితే చివర్లో వీరిద్దరినీ అవుట్ చేసి భారత్ మ్యాచ్ పై పట్టు చేజారకుండా కాపాడుకుంది.
భువి భళా.. ఇంగ్లండ్ 'బాలెన్స్'
Published Fri, Jul 18 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement