
భారత్ 295 పరుగులకు ఆలౌట్
లండన్: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 295 పరుగులకు ఆలౌటయింది. 290 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 5 పరుగులు మాత్రమే జోడించింది. టెయిలెండర్ మహ్మద్ షమీ 19 పరుగులు చేసి అవుటవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. షమీని స్ట్రోక్ అవుట్ చేశాడు. 12 పరుగులతో ఇషాంత్ శర్మ నాటౌట్ గా నిలిచాడు.
భారత యువ ఆటగాడు అజింక్య రహానే లార్డ్స్‌లో తాను ఆడిన తొలి టెస్టులోనే శతకం సాధించి... మైదానంలోని ‘హానర్స్ బోర్డు’లో దిగ్గజాల సరసన పేరు రాయించుకోవడం తొలి రోజు ఆటలో విశేషం. రహానే 103 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 4 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్, స్ట్రోక్ రెండేసి వికెట్లు తీశాడు. ప్లంకెట్, అలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.