విజయ్ 11, రహానే 8 | murali vijay, Ajinkya rahane hits half centuries in colombo Test | Sakshi
Sakshi News home page

విజయ్ 11, రహానే 8

Published Sun, Aug 23 2015 11:03 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

విజయ్ 11, రహానే 8

విజయ్ 11, రహానే 8

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు మురళీ విజయ్, అజింక్య రహానే అర్ధసెంచరీలు సాధించారు. విజయ్ 104 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. టెస్టుల్లో అతడికిది 11 అర్ధసెంచరీ. రహానే టెస్టుల్లో 8వ హాఫ్ సెంచరీ సాధించాడు. 118 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధసెంచరీ బాదాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 228 బంతుల్లో 100 పరుగులు జోడించారు.

భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 132/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. విజయ్(74), రహానే(55) క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటివరకు లంకపై టీమిండియా 219 పరుగుల ఆధిక్యం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement