
న్యూఢిల్లీ:భారత క్రికెటర్ మురళీ విజయ్ మూడోసారి తండ్రయ్యాడు. ఇప్పటికే ఒక కుమారుడు, కుమార్తె ఉన్న మురళీ దంపతులకు మూడో బిడ్డ జన్మించింది. సోమవారం మురళీ విజయ్ భార్య నికిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు తన పెద్ద కుమారుడు అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకున్న ఫోటోను మురళీ విజయ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 'ఇద్దరు రాక్ స్టార్లలో ఒకరు మరొకర్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు'అని క్యాప్షన్ లో పేర్కొన్నాడు.
ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా గాయానికి గురైన మురళీ అప్పటినుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో ఆరంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనతో మురళీ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది.
Two Rockstars!! One introducing the other to the world . Feeling Blessed. #grateful #lovetoall #moretolife pic.twitter.com/1dPJtSpcK9
— Murali Vijay (@mvj888) 2 October 2017
Comments
Please login to add a commentAdd a comment