దుబాయ్: ఐపీఎల్ 2020 నుంచి అనూహ్యంగా తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ప్రధాన ఆటగాడు సురేశ్ రైనా స్థానాన్ని మొరళీ విజయ్ భర్తీ చేయగలడని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ కే. శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. సీఎస్‌కే జట్టులో రైనా కీలక పాత్ర పోషించాడని అన్నారు. అయితే కెరీర్‌లో తిరిగి పుంజుకునేందుకు మొరళీ విజయ్‌కు అనుకూల సమయమని అభిప్రాయపడ్డారు. కాగా అద్భుత ఆటతీరుతో విజయ్ ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు శ్రీకాంత్ ఆడాడని గుర్తు చేశాడు.
ఓపెనర్‌గా షేన్ వాట్సన్‌తో కలిసి విజయ్ ఇన్నింగ్స్ ప్రారంభించగలడని తెలిపాడు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనియే సీఎస్‌కే టీమ్‌కు అతి పెద్ద బలమని తెలిపారు. మ్యాచ్‌లను గెలిపించడంలో ధోనికి అపార అనుభవం ఉందని, మ్యాచ్‌లు గెలవగలిగే ఫార్ములా ఆయనకు తెలుసని కే శ్రీకాంత్ పేర్కొన్నాడు. (చదవండి: మూడో ఫైనల్.. రెండో ట్రోఫీ.. అదిరిందయ్యా ధోని)
Comments
Please login to add a commentAdd a comment