
టీమ్ పెయిన్, విరాట్ కోహ్లి
అడిలైడ్ : తమ పేసర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఓ ఆట ఆడుకుంటారని, అతను మునపటిలా సెంచరీలు చేయలేడని ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టీమ్ పెయిన్ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్ పెయిన్ మీడియాతో మాట్లాడుతూ.. మా పేస్ బౌలింగ్ నైపుణ్యంపై నాకు నమ్మకం ఉంది. వారు కచ్చితంగా కోహ్లిని ఇబ్బంది పెట్టగలరు. మేం ప్రశాంతంగా.. మా నైపుణ్యాలను ప్రదర్శిస్తాం.
తమ జట్టు కోహ్లి రికార్డును చూసి ఏం భయపడటం లేదు. మా బౌలింగ్ వారికంటే మెరుగ్గా ఉంది. విజయం సాధించే సత్తా తమకు ఉంది’ అని టీమ్ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఆసీస్ అప్పటిలా బలమైన జట్టుకాదని, టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆపడం వారి తరం కాదని మురళి విజయ్ అభిప్రాయపడ్డాడు. మురళి విజయ్ ఒక్కడే కాదు.. చాలా మంది మాజీ క్రికెటర్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ ఇప్పుడు సిరీస్ నెగ్గకపోతే ఎప్పటికి గెలవదని.. వారికి ఇదో మంచి అవకాశమని చెప్పుకొస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment