2020 ఏడాది చివర్లో బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది. కోహ్లి సారధ్యంలో డే నైట్ టెస్టు ఆడిన టీమిండియా అడిలైడ్‌లో బొక్కా బోర్లా పడింది. 36 పరుగులకే ఆలౌటై టెస్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ తర్వాత కోహ్లి పెటర్నిటి సెలవులపై స్వదేశానికి వెళ్లిపోవడంతో రహానేకు బాధ్యతలు అప్పగించారు.
ఆ తర్వాత భారత్ 2-1తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. సీనియర్లు లేకుండా, కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా ఆస్ట్రేలియాను గబ్బా టెస్టులో ఓడించి, 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. భారత క్రికెట్ చరిత్రలో ఈ సిరీస్ విజయం చాలా ప్రత్యేకమైనదిగా చిరస్థాయిగా మిగిలిపోయింది. తాజాగా వూట్ అనే ప్లాట్‌ఫామ్.. ఆస్ట్రేలియా-భారత్ సిరీస్‌ను‘బందో మే త దమ్’ అనే డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించింది. ఈ డాక్యుమెంటరీలో సిరీస్‌లో ఆటగాళ్ల అనుభవాలు, విశేషాలను పంచుకుంది. తాజాగా అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అడిలైడ్ టెస్టులో రహానే.. కోహ్లిని రనౌట్ చేసిన విషయాన్ని మరొకసారి గుర్తుచేశాడు.
‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 20-30 పరుగుల వద్ద ఉన్నప్పుడు అనుకుంటా... లైటింగ్ పోయింది. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే విరాట్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగించాడు. కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో ఉంటే మాకు నష్టం జరిగేదే. మ్యాచ్ గడిచేకొద్దీ విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకుపోతున్నాడు. మరో ఎండ్‌లో రహానే కూడా బాగా ఆడుతున్నాడు. ఇద్దరూ కలిసి చక్కగా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు. లక్కీగా రహానే, కోహ్లీని రనౌట్ చేశాడు. మా వరకూ అదే గేమ్ ఛేజింగ్ మూమెంట్. అప్పటిదాకా మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోతుందనే భయపడ్డాం. అయితే కోహ్లీ అవుట్ అయ్యాక మాలో నమ్మకం పెరిగింది..ఎందుకంటే విరాట్ కోహ్లీ బెస్ట్ ప్లేయర్. అతన్ని అవుట్ చేస్తే మిగిలిన వారిని ఇబ్బంది పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అనుకున్నట్టే కోహ్లీ అవుట్ అయ్యాక మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చేసింది... ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే...’ అంటూ ‘బందో మే త దమ్’ అనే డాక్యుమెంటరీలో కామెంట్ చేశాడు
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అయితే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకి ఆలౌట్ కావడంతో.. భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆధిక్యం సాధించామనే సంతోషం టీమిండియాకు ఎక్కువసేపు నిలవలేదు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 45 నిమిషాల్లోనే కుప్పకూలింది. 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మహ్మద్ షమీ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరడంతో 36/9 వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్ తెరపడింది.
It’s finally here!🏏
— Voot (@justvoot) June 16, 2022
20 players, 4 Tests, 2 of cricket’s best teams, 1 mind-blowing story!
Come & witness the Baap of all Fightbacks & the blood, sweat and tears that went into achieving it.
Watch Neeraj Pandey’s Bandon Mein Tha Dum, streaming now on Voot Select. pic.twitter.com/8YeCMfrTVf
చదవండి: క్రికెట్‌లో ఇలాంటి అద్భుతాలు అరుదుగా.. 134 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పృథ్వీ షా
Shaheen Afridi: పాక్ బౌలర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా.. ఒక్కదానికే!
Comments
Please login to add a commentAdd a comment