టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్‌లో తొలిసారి స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. వినడానికి విచిత్రంగా విన్నా ఇది నిజం. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో కోహ్లి స్టంపౌటయ్యాడు. భారత రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇన్నింగ్స్ 19వ ఓవర్ టాడ్ మర్ఫీ వేవాడు. ఆ ఓవర్ రెండో బంతిని కోహ్లి ఫ్రంట్‌ఫుట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్ అయి కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లో పడింది.
సెకన్ కూడా వేస్ట్ చేయని కేరీ విరాట్ బ్యాట్‌ను క్రీజులో పెట్టేలోపే బెయిల్స్‌ను ఎగరేశాడు. అప్పటికి కోహ్లి క్రీజుకు చాలా దూరంగా ఉండడం గమనార్హం. దీంతో కోహ్లి తొలిసారి తన టెస్టు కెరీర్‌లో స్టంపౌట్ అయ్యాడు. కోహ్లి కెరీర్ ఆరంభించి 15 ఏళ్లు కావొస్తుంది. ఈ 15 ఏళ్లలో కోహ్లి క్రీజు విడిచి ఫ్రంట్‌ఫుట్ ఆడిన సందర్భాలు చాలా తక్కువ. ఇక వన్డేలు, టి20ల్లో తన ఆటను అందుకునే మొనగాడు లేడని ఇప్పటికే నిరూపించుకున్నాడు.
అయితే టెస్టుల్లో మాత్రం కోహ్లి ఆట కాస్త నిధానంగానే ఉంటుంది. మాములుగానే క్రీజులో నుంచి బయటికి రాని కోహ్లి టెస్టుల్లో అసలు ఆ సాహసమే చేయడు. కానీ ఆసీస్‌తో టెస్టులో వేగంగా ఆడాలనే లేక ఇంకేదైనా కారణమో తెలియదు కానీ తొలిసారి స్టంప్ అవుట్ అయ్యి కోహ్లి అవసరం లేని రికార్డును కొనితెచ్చుకున్నాడు. ఇక మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఔట్ కాదని తేలినప్పటికి అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు.
చదవండి: KL Rahul: ఇక భరించలేం.. తొలగించాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment