మురళీ విజయ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై: ఐపీఎల్‌లో తిరిగి సొంత జట్టుకు ఆడటం పట్ల టీమిండియా బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. తనను వేలంలో తొలి రోజు ఏ ప్రాంచైజీ తీసుకొకపోవటంతో నిరాశ చెందినా, చివరకు చెన్నె కొనుగోలు చేయడం సంతృప్తినిచ్చిందన్నాడు. ఒకవేళ ఐపీఎల్ వేలంలో తనను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయకపోతే పుజారా, ఇషాంత్ శర్మల మాదిరిగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడాలని అనుకున్నానని విజయ్ తెలిపాడు.
ఇది తనకు సీఎస్‌కే ఇచ్చిన గొప్ప అవకాశమని, వారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని విజయ్ అన్నారు. ప్రతి ఆటగాడు సీఎస్‌కేను తమ జట్టుగా భావించి సమష్టిగా రాణించడానికి కృషి చేస్తారని విజయ్ పేర్కొన్నారు. ఈసారి ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే జట్టే ఐపీఎల్ విజేతగా నిలుస్తుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఓటమిపై స్పందించిన విజయ్.. బౌలర్లు అద్బుత ప్రదర్శన చేసినా, బ్యాటింగ్ వైపల్యంతో ఓటమి చవిచూసామని, బ్యాట్స్‌మెన్‌కు ఈ సిరీస్ గుణపాఠం లాంటిదని అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో జరిగే సిరీస్‌లపై దృష్టి పెట్టానని విజయ్ వివరించారు. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్‌లో 2010లో జరిగిన ఫైనల్ తన అమితమైన ఆసక్తి కలిగించిందని విజయ్ అన్నారు. గత ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ, పంజాబ్ జట్లకు విజయ్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment