PC : Twitter
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి మెరుపులు మెరిపించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో నాలుగు బంతులు మిగిలి ఉండగా బ్యాటింగ్‌కు వచ్చిన ధోని హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
చివరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యాకు మిస్టర్ కూల్ చుక్కలు చూపించాడు. కేవలం 4 బంతుల్లోనే మూడు సిక్సర్లతో 20 పరుగులు ధోని చేశాడు. ధోని చేసిన ఈ 20 పరుగులే సీఎస్‌కే విజయానికి కారణమయ్యాయి.
గాయపడిన ధోని..
అయితే ఈ మ్యాచ్‌లో ధోని గాయపడ్డాడు. పేసర్ పతిరానా వేసిన ఓవర్‌లో బంతిని ఆపే క్రమంలో మిస్టర్ కూల్ కాలికి గాయమైంది. అయినప్పటికి ధోని నొప్పితో బాధపడుతూనే తన వికెట్ కీపింగ్ బాధ్యతలను కొనసాగించాడు. అయితే మ్యాచ్ అనంతరం సీఎస్‌కే టీమ్ హోటల్‌కు వేళ్లే క్రమంలో ధోని కుంటుతూ నడవడం కన్పించింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ధోని గాయంపై సీఎస్‌కే మెనెజ్‌మెంట్ అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సీఎస్‌కే తమ తదుపరి ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు నాలుగు రోజులు విరామం లభించడంతో ధోని తన గాయం నుంచి కోలుకునే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment