
ఢిల్లీ: శ‍్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీ సాధించాడు. మురళీ విజయ్ 67 బంతుల్లో అర్థశతకంతో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను శిఖర్ ధావన్, మురళీ విజయ్‌లు ఆరంభించారు. అయితే శిఖర్(23) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా,ఆపై చతేశ్వరా పుజారా(23) రెండో వికెట్‌గా అవుటయ్యాడు. కాగా, మురళీ విజయ్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది టెస్టుల్లో విజయ్‌కు 16వ హాఫ్ సెంచరీ. తొలి రోజు ఆటలో భారత్ లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. మురళీ విజయ్‌కు జతగా కోహ్లి(17 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన‍్నాడు.
Comments
Please login to add a commentAdd a comment