
శ్రీలంక సిరీస్‌కి జట్టులోకి వస్తా : విజయ్
చెన్నై: భారత ఓపెనర్ మురళీ విజయ్ త్వరలో శ్రీలంకతో జరిగే సిరీస్ నాటికి పూర్తి ఫిట్‌గా మారతానని ప్రకటించాడు. తమిళనాడుకు చెందిన ఈ బ్యాట్స్‌మన్ మణికట్టు గాయం కారణంగా ఐపీఎల్–10కు దూరమై లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న విజయ్ ఇప్పుడు చెన్నైలోని ఎన్‌సీఏ ట్రైనర్ రజనీకాంత్ దగ్గర ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
‘సర్జరీ కారణంగా దొరికిన సమయంలో నా బ్యాటింగ్‌పైన, ఫిట్‌నెస్‌పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. మూడు ఫార్మాట్లలో రాణించాలంటే ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. అందుకోసం చాలా శ్రమిస్తున్నాను. వచ్చే నెలలో జరిగే శ్రీలంక సిరీస్‌నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టుకు అందుబాటులో ఉంటాను’ అని ఈ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ తెలిపాడు. ఈ గాయం వల్ల కొంతకాలం తన కుటుంబంతో గడిపే విలువైన సమయం దొరికిందని విజయ్ చెప్పుకొచ్చాడు.