
రూ.3 కోట్లు పలికిన మురళీ విజయ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎనిమిదో సీజన్ వేలం సోమవారమిక్కడ ప్రారంభమైంది. రూ.3 కోట్లు పలికిన మురళీ విజయ్..
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎనిమిదో సీజన్ వేలం సోమవారమిక్కడ ప్రారంభమైంది. ఐపీఎల్ అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ ఆధ్వర్యంలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరుగుతోంది. ఓపెనర్ బ్యాట్స్మెన్ మురళీ విజయ్ను రూ.3 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు సొంతం చేసుకుంది. వేలానికి మొత్తం 344మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.
కాగా ఏంజిలో మాథ్యూస్ (శ్రీలంక)రూ.7.5 కోట్లు పలకగా, సూపర్ ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా రూ.2 కోట్లు పలికాడు. అలాగే ఆస్ట్రేలియా స్టార్ ఆరోన్ ఫించ్ ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. గతేడాది వేలంలో యువీని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు అనూహ్యంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అంచనాలకు తగ్గట్టు రాణించకపోవడంతో యువీని ఆ జట్టు వదులుకుంది.