
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో శివమ్ దూబే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో శివమ్ దూబే.. 45 బంతుల్లో 95 నాటౌట్, 5 ఫోర్లు, 8 సిక్సర్లతో శివాలెత్తాడు. మరో బ్యాట్స్‌మన్ ఊతప్పతో పోటాపోటీగా పరుగులు సాధించాడు. ఆఖర్లో సెంచరీ చేసే అవకాశం వచ్చినప్పటికి తృటిలో చేజార్చుకున్నాడు. అయితే తన ఇన్నింగ్స్‌తో మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తాడు.
ఈ నేపథ్యంలో శివమ్ దూబే సీఎస్‌కే తరపున 11 ఏళ్ల రికార్డును సమం చేశాడు. ఆ రికార్డు ఏంటంటే.. సీఎస్‌కే, ఆర్‌సీబీ ముఖాముఖి తలపడిన సందర్భాల్లో సీఎస్‌కే బ్యాట్స్‌మన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 95గా ఉండేది. 2011 సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య జరిగిన ఫైనల్లో మురళీ విజయ్ 95 పరుగులు సాధించాడు. తాజాగా శివమ్ దూబే.. అదే ఆర్‌సీబీపై 95 పరుగులు చేసి మురళీ విజయ్‌తో సమంగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment