Shikhar Dhawan Divorce Case: Top Other Cricketers Who are Divorced - Sakshi
Sakshi News home page

Shikhar Dhawan Divorce: విడాకులు తీసుకున్న టాప్‌-4 జంటలు

Published Wed, Sep 8 2021 11:08 AM | Last Updated on Thu, Sep 9 2021 7:35 AM

Shikhar Dhawan Ayesha Mukherjee: 4 Other High Profile Cricketers Divorce - Sakshi

దినేశ్‌ కార్తిక్‌తో విడిపోయి మురళీ విజయ్‌ను పెళ్లి చేసుకున్న నికిత

Shikhar Dhawan-Ayesha Mukherjee Divorce: ‘‘రెండోసారి డైవోర్సీ అయ్యేంత వరకు విడాకులు అనేది చెత్తపదం అనుకున్నా’’ అంటూ టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ భార్య అయేషా ముఖర్జీ తాము విడిపోయిన విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. శిఖర్‌తో తన బంధం ఇక ముగిసిపోయిందని ఆమె స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ అన్యోన్యతను ప్రదర్శించే ఈ జంట విడాకులు తీసుకోవడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది.

అంతేకాదు.. ఈ విషయంపై గబ్బర్‌ ఇంతవరకు స్పందించకపోవడంతో ‘‘ఇంతకూ ఇది నిజమేనా’’ అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. ఏదేమైనా.. శిఖర్‌ విడాకుల అంశం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ క్రమంలో గతంలో భార్యలతో విడిపోయిన టీమిండియా స్టార్‌, మాజీ క్రికెటర్ల గురించి నెటిజన్లు చర్చింకుంటున్నారు.

మహ్మద్‌ అజారుద్దీన్‌- సంగీత బిజ్లానీ
భారత జట్టు మాజీ సారథి మహ్మద్‌ అజారుద్దీన్‌- సంగీత బిజ్లానీ బిగ్గెస్ట్‌ సెలబ్రిటీ జంటగా పేరొందారు. బాలీవుడ్‌ నటి అయిన సంగీత అందానికి ఫిదా అయిన అజారుద్దీన్‌ మొదటి భార్యకు దూరమై.. 1996లో ఆమెను వివాహమాడాడు. అప్పటికే అజారుద్దీన్‌కు ఇద్దరు కొడుకులు. ఇక సంగీతతో కూడా అతడు సుదీర్ఘకాలం పాటు బంధం కొనసాగించలేకపోయాడు. 2010లో ఈ జంట విడిపోయింది.

వినోద్‌ కాంబ్లీ- నోయెలా లూయిస్‌
టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ, తన చిన్ననాటి స్నేహితురాలు నోయెలా లూయిస్‌ను పెళ్లాడాడు. 1998లో వివాహ బంధంతో ఒక్కటైన జంట అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకుంది. అయితే, ​కొంతకాలం తర్వాత మాజీ మోడల్‌ ఆండ్రియా హెవిట్‌ను వివాహమాడిన వినోద్‌ కాంబ్లీ ఆమెతో జీవనం కొనసాగిస్తున్నాడు.

జవగళ్‌ శ్రీనాథ్‌- జ్యోత్స
భారత మాజీ పేసర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌ వైవాహిక​ బంధం కూడా సాఫీగా సాగలేదు. 1999లో జ్యోత్స అనే మహిళను పెళ్లాడిన శ్రీనాథ్‌.. తొమ్మిదేళ్ల పాటు ఆమెతో జీవితం పంచుకున్నాడు. కానీ, మనస్పర్దల కారణంగా 2008లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా ఉన్న శ్రీనాథ్‌ జర్నలిస్టు మాధవి పాత్రవళిని పెళ్లి చేసుకున్నాడు.

దినేశ్‌ కార్తీక్‌- నికితా వంజారా
టీమిండియా క్రికెటర్ల విడాకుల అంశంలో నేటికీ హాట్‌టాపిక్‌ అంటే దినేశ్‌- నికితా జంటదే. చిన్ననాటి స్నేహితురాలైన నికితను పెళ్లాడిన దినేశ్‌కు ఆమె ఊహించని షాకిచ్చింది. దినేశ్‌ సహ ఆటగాడు, భారత క్రికెటర్‌ మురళీ విజయ్‌తో ఆమె బంధం కొనసాగించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దినేశ్‌ 2012లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. మూడేళ్ల తర్వాత స్వ్యాష్‌ ప్లేయర్‌ దీపికా పళ్లికల్‌ను వివాహమాడాడు. మరోవైపు.. నికితా.. మురళీ విజయ్‌ను పెళ్లి చేసుకుని సెటిల్‌ అయ్యింది.

చదవండి: Ind Vs Eng: టీమిండియాదే క్రెడిట్‌ అంతా: ఇంగ్లండ్‌ కోచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement