
టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ ట్రిక్కి వారియర్స్‌కు ఆడుతున్న విజయ్‌ను మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు ఆట పట్టించారు. విజయ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా డీకే.. డీకే అంటూ కేకలు పెడుతూ తీవ్ర అసౌకర్యానికి గురి చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్‌కు దండం పెడుతూ అరవద్దని ప్రాధేయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టంట వైరలవుతోంది.
#TNPL2022 DK DK DK ......
— Muthu (@muthu_offl) July 7, 2022
Murali Vijay reaction pic.twitter.com/wK8ZJ84351
కాగా, డీకే (దినేష్ కార్తీక్) మొదటి భార్య నిఖిత వంజరను మురళీ విజయ్ అనైతికంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత డీకే.. ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం డీకే కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతూ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా.. విజయ్ సరైన అవకాశాలు లేక గల్లీ క్రికెట్‌కు పరిమితమయ్యాడు.
చదవండి: ఆఖరి ఓవర్లో సిక్సర్‌తో టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే?