శిఖర్ ధావన్ సెంచరీ
ఫతుల్లా: బంగ్లాదేశ్ తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ సాధించాడు. 101 బంతుల్లో 16 ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో ధావన్ కు ఇది మూడో సెంచరీ కాగా, బంగ్లాదేశ్ పై మొదటిది.
మరో ఓపెనర్ మురళీ విజయ్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 98 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ బాదాడు. టెస్టుల్లో అతకిది 11 అర్ధసెంచరీ, బంగ్లాదేశ్ పై మొదటిది. ధావన్, విజయ్ శుభారంభం అందించడంతో టీమిండియా 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు చేసింది. ధావన్ 103 , విజయ్ 64 పరుగులతో ఆడుతున్నారు.