టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంటర్ననేషనల్ క్రికెట్‌తో పాటు దేశీవాళీ క్రికెట్ నుంచి ధావన్ తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, గౌతం గంభీర్ వంటి దిగ్గజ క్రికెటర్లు విషెస్ తెలపగా.. తాజాగా ఈ జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చేరాడు. ధావన్‌ను ఉద్దేశించి కోహ్లి ఓ భావోద్వేగ పోస్టును షేర్ చేశాడు. గబ్బర్‌తో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో కింగ్ కోహ్లి పంచుకున్నాడు.
"శిఖర్.. నీ ఘనమైన అరంగేట్రం నుంచి టీమిండియా అద్భుతమైన ఓపెనర్లలో ఒకడిగా మారేవరకు మాకు ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావు. ఆట పట్ల మీ అభిరుచి, క్రీడాస్ఫూర్తి, నీ చిరునవ్వును మేము కచ్చితంగా మిస్ అవుతాము. కానీ మీ లెగసీ మాత్రం కొనసాగుతుంది.
ఎన్నో జ్ఞాపకాలు, మరపురాని ప్రదర్శనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆఫ్‌ది ఫీల్డ్ మొదలు పెట్టబోయే నీ రెండో ఇన్నింగ్స్‌కు ఆల్ దిబెస్ట్ అని" ఎక్స్‌లో కోహ్లి రాసుకొచ్చాడు. కాగా కోహ్లి, ధావన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఢిల్లీ తరపున జూనియర్ క్రికెట్ కూడా ఆడారు. కాగా టీమిండియాకు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల్లో ధావన్ ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు శిఖర్ ధావన్ ఖాతాలో ఉన్నాయి.
Shikhar @SDhawan25 from your fearless debut to becoming one of India's most dependable openers, you've given us countless memories to cherish. Your passion for the game, your sportsmanship and your trademark smile will be missed, but your legacy lives on. Thank you for the…
— Virat Kohli (@imVkohli) August 25, 2024
Comments
Please login to add a commentAdd a comment