భారత క్రికెట్‌లో మరో శకం ముగిసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. అదే విధంగా దేశవాళీ క్రికెట్ నుంచి కూడా ధావన్ తప్పుకున్నాడు. అతడి నిర్ణయం క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురిచేసింది.
14 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ధావన్.. ఎన్నో అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్‌లో ఎన్నో ఘనతలను కూడా అందుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా భారత్‌కు ఎన్నో అద్భుత ఆరంభాలను ఇచ్చిన ధావన్ క్రికెట్ జర్నీపై ఓ లుక్కేద్దాం.
తొలి మ్యాచ్‌లోనే డకౌట్.. అయినా
2010లో వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో సిల్వర్ డకౌటై అందరని నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత తన నిలకడ ప్రదర్శనతో ధావన్ జట్టులో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
అయితే వన్డేల్లో తొలి సెంచరీ మార్క్‌ను అందుకోవడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాపై తన మొదటి వన్డే సెంచరీ మార్క్‌ను ధావన్ అందుకున్నాడు. ఆ తర్వాత ధావన్ వరుసగా శతకాలు మ్రోత మోగించాడు.
టెస్టు అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు..
అప్పటికే వన్డేల్లో తన మార్క్‌ను చూపించిన ధావన్.. మార్చి 14, 2013న మొహాలీలో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు. అయితే తన అరంగేట్రంలోనే గబ్బర్ సత్తాచాటాడు. ఆసీస్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 85 బంతుల్లోనే తన తొలి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో తొలి మ్యాచ్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 33 ఫోర్లు, 2 సిక్స్‌లతో 187 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తన డెబ్యూలో భీబత్సం సృష్టించిన ధావన్ 'మొహాలీ హరికేన్‌గా పేరు గాంచాడు. ధావన్ డెబ్యూ ఇన్నింగ్స్‌ను అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుపులు..
2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడడంలో ధావన్‌ది కీలక పాత్ర. ఆ టోర్నీ అసాంతం గబ్బర్ మెరుపులు మెరిపించాడు. 5 మ్యాచుల్లోనే గబ్బర్ ఏకంగా 90.75 సగటుతో 363 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో వరుసగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌పై సెంచరీలతో చెలరేగాడు.
చివరి మ్యాచ్ అదే..
భారత స్టార్ ఓపెనర్‌గా ఒక వెలుగు వెలిగిన ధావన్ నెమ్మదిగా తన ఫామ్‌ను కోల్పోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాకుండా యువ క్రికెటర్ల రాకతో ధావన్‌ను సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. ధావన్ చివరగా భారత్ తరుపన 2022లో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో ఆడాడు.
ఓవరాల్‌గా టీమిండియాకు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల్లో గబ్బర్ ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు శిఖర్ ధావన్ ఖాతాలో ఉన్నాయి.
మిస్‌యూ గబ్బర్..
ఇక ధావన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. మిస్‌యూ గబ్బర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధావన్ ఇకపై కేవలం ఐపీఎల్‌లో మాత్రం ఆ
Comments
Please login to add a commentAdd a comment