మురళీ విజయ్ హాఫ్ సెంచరీ | murali vijay gets an half century | Sakshi
Sakshi News home page

మురళీ విజయ్ హాఫ్ సెంచరీ

Published Fri, Dec 9 2016 4:03 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

మురళీ విజయ్ హాఫ్ సెంచరీ

మురళీ విజయ్ హాఫ్ సెంచరీ

ముంబై:ఇంగ్లండ్తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో భారత ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అర్థ శతకం సాధించాడు. ఇది విజయ్ కెరీర్లో 15వ హాఫ్ సెంచరీ. శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా  తొలుత ఇంగ్లండ్ను 400 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. ఆ తరువాత మొదటి ఇన్నింగ్స్ను ఆరంభించింది. భారత ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్తో కలిసి మురళీ విజయ్ ప్రారంభించాడు.

కాగా, రాహుల్(24) తొలి వికెట్ గా అవుటయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత విజయ్తో కలిసిన చటేశ్వర పూజారా ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు. ఈ క్రమంలోనే విజయ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడంతో భారత్ 44.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 133 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement