ఢాకా: టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో్ భాగంగా నాల్గో రోజు ఆటలో బంగ్లాదేశ్ భోజన సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో ఇమ్రుల్ కేయ్స్ (59), షకిబుల్ హసన్(0) లు క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు తమీమ్ ఇక్బాల్(19), మామ్మినుల్ హక్యూ(30),రహీమ్(2) పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా, హర్భజన్ సింగ్ కు ఒక వికెట్ లభించింది.
ఇదిలా ఉండగా టీమిండియా 462/6 ఓవర్ నైట్ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 351 పరుగులు వెనుకబడి ఉంది. కాగా, ఈరోజు ఆట ప్రారంభించిన కాసేపటకే వరుణుడు మరోసారి ఆటంకం కల్గించాడు.