
IPL 2022 New Sponsor Rupay: నానాటికి పెరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రేజ్ దృష్ట్యా.. క్యాష్ రిచ్ లీగ్‌తో జతకట్టేందుకు బడా కార్పొరేట్ సంస్థలు ఎగబడుతున్నాయి. ఇప్పటికే టాటా, డ్రీమ్ 11, అన్ అకాడమీ, క్రెడ్, అప్స్టాక్స్, స్విగ్గీ ఇన్స్టంట్, పేటీఎం, సియట్ వంటి కార్పొరేట్లు ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోగా, తాజాగా మరో ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రూపే) ఐపీఎల్‌తో చేతులు కలిపింది.
రూపే మూడేళ్ల పాటు ఐపీఎల్‌కు అఫిషియల్ పార్ట్‌నర్‌గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మీడియా కథనాల ప్రకారం రూపే ఏడాదికి రూ. 42 కోట్లకు ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఒప్పందంతో ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరగనుంది. కాగా, మార్చి 26 నుంచి మహారాష్ట్ర వేదికగా ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ నుంచి ‘టాటా’ లీగ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది.
ఐపీఎల్ 2022 సెంట్రల్ స్పాన్సర్స్ :
- టాటా : టైటిల్ స్పాన్సర్
- డ్రీమ్ 11 : అఫిషియల్ పార్ట్‌నర్
- అన్ అకాడమీ : అఫిషియల్ పార్ట్‌నర్
- క్రెడ్ : అఫిషియల్ పార్ట్‌నర్
- అప్స్టాక్స్ : అఫిషియల్ పార్ట్‌నర్
- స్విగ్గీ ఇన్స్టంట్ : అఫిషియల్ పార్ట్‌నర్
- పేటీఎం : అఫిషియల్ అంపైర్ పార్ట్‌నర్
- సియట్ : అఫిషియల్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్‌నర్
- రూపే : అఫిషియల్ పార్ట్‌నర్
చదవండి: IND VS SL 1st Test: ఒత్తిడిలో విరాట్..? ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్..!
Comments
Please login to add a commentAdd a comment