deal canceled
-
సోనీపై ఎన్సీఎల్టీకి జీ
న్యూఢిల్లీ: ప్రతిపాదిత విలీన డీల్‌ను రద్దు చేసుకోవాలన్న సోనీ నిర్ణయంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించినట్లు జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) వెల్లడించింది. అలాగే 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 748.5 కోట్లు) టెరి్మనేషన్ ఫీజు కట్టాలన్న సోనీ నోటీసులపై కూడా తగు చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ సమాచారమిచ్చింది. జపాన్‌కి చెందిన సోనీ గ్రూప్ భారత విభాగం (కల్వర్ మ్యాక్స్), జీల్ విలీన ప్రతిపాదన రద్దయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల కథనాల ప్రకారం విలీన కంపెనీ సారథ్య బాధ్యతలను జీ సీఈవో పునీత్ గోయెంకాకు అప్పగించడాన్ని ఇష్టపడకపోవడం వల్ల సోనీ గ్రూప్ ఈ డీల్‌ను రద్దు చేసుకుంది. ఆర్థిక మంత్రికి సుభాష్ చంద్ర లేఖ.. విలీన డీల్ నుంచి సోనీ వైదొలగడానికి కొద్ది రోజుల ముందు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర లేఖ రాశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఈ ఒప్పందం కుదరకుండా చేసేందుకు ప్రయతి్నస్తోందంటూ అందులో ఆరోపించారు. జీ నిధులను దురి్వనియోగం చేశారంటూ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకాపై సెబీ చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో సెబీ విచారణ జరపరాదని తాను అనడం లేదని, కాకపోతే సరిగ్గా డీల్ కుదిరే సమయంలో సెబీ ఇందుకు సంబంధించిన నోటీసులివ్వడానికి కారణమేమిటనేదే తన ఆందోళన అని చంద్ర పేర్కొన్నారు. జీల్ మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్థిక మంత్రి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యరి్ధంచారు. -
జీ–సోనీ డీల్‌కు బ్రేక్?
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) – సోనీ భారత విభాగం విలీన ప్రయత్నాలకు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. విలీన సంస్థకు జీ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించే విషయంపై సోనీ సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నిర్దిష్ట షరతులను పాటించలేదనే కారణంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సోనీ గ్రూప్ భావిస్తున్నట్లు తెలిపారు. డీల్ కుదుర్చుకునేందుకు నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే జనవరి 20లోగా రద్దు నోటీసును పంపించే అవకాశం ఉందని వివరించాయి. వివరాల్లోకి వెళ్తే.. జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ తమ భారత విభాగాన్ని, జీల్‌ను విలీనం చేసేందుకు సంబంధించి 2021లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది సాకారమైతే దేశీయంగా 10 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజంగా విలీన సంస్థ ఆవిర్భవిస్తుంది. సదరు ఒప్పందం ప్రకారం జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర తనయుడు, సీఈవో పునీత్ గోయెంకానే విలీన సంస్థకు కూడా సారథ్యం వహించాలి. కానీ, ఈలోగా చంద్ర, గోయెంకాలు తమ అధికారాన్ని దురి్వనియోగం చేసి సొంత అవసరాల కోసం నిధులను మళ్లించారంటూ సెబీ ఆరోపించడంతో డీల్ పురోగతిపై సందేహాలు రేకెత్తాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్‌పరమైన వివాదంగా పరిగణిస్తున్న సోనీ.. విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయెంకాకు అప్పజెప్పడానికి విముఖంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ, ముందుగా అనుకున్న ప్రకారం సీఈవోగా తనని కొనసాగించాల్సిందేనంటూ గోయెంకా పట్టుబడుతున్నట్లు వివరించాయి. ఈ నేపథ్యంలోనే డీల్‌ను సోనీ రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. -
నష్టాల్లో ఇన్ఫోసిస్.. ఆ ఒక్కటే కారణమా..!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' (Infosys) కంపెనీ షేర్లు గత ఐదు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు కూడా సంస్థ షేర్స్ రెండు శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణం ఏంటి, మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి డిసెంబర్ 22 సాయంత్రం మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (MoU) రద్దు చేసుకున్నట్లు ఇన్ఫోసిస్ కంపెనీ ప్రకటించిన తర్వాత సంస్థ షేర్లు పతనమవ్వడం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ ప్రకటన ముందు వరకు దూసుకెళ్లిన షేర్లు ఒక్కసారిగా పడిపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. మూడు రోజుల వరుస సెలవుల తర్వాత డిసెంబర్ 26న(మంగళవారం) కంపెనీ ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి స్టాక్ రూ. 1,534 స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత తేరుకుని 1.08 శాతం నష్టంతో రూ. 1546 వద్ద నిలిచింది. ఇదీ చదవండి: అప్పులపాలు.. యంత్రాలన్నీ తుప్పుపట్టి పనికిరాని దశలో.. టాటా రాకతో అంతా తారుమారు! ఇన్ఫోసిస్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) సదరు కంపెనీ రద్దు చేసుకుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. దీంతో సంస్థ చేసుకున్న 1.5 బిలియన్ డాలర్లు లేదా సుమారు రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్ అయింది. ఈ కారణంగానే కంపెనీ షేర్స్ ప్రస్తుతం తగ్గు ముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. -
టీసీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ: బిగ్ డీల్ నుంచి ట్రాన్సామెరికా ఔట్!
సాక్షి, ముంబై: భారతీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ భారీ డీల్ నుంచి తప్పుకుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. టీసీఎస్ లాంటి థర్డ్-పార్టీ ఐటీ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఇన్సోర్సింగ్పై ఎక్కువగా దృష్టి పెట్టాలని ట్రాన్సామెరికా యోచిస్తోందని తెలుస్తోంది. ట్రాన్సామెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో 10 సంవత్సరాల ఒప్పందం ప్రస్తుత పరిస్థితులు, సంబంధిత వ్యాపార ప్రాధాన్యతల రీత్యా గడువులోపే ముగిసిందని ధృవీకరించింది. 10 ఏళ్ల డీల్ విలువ 2 బిలియన్ డాలర్లు. ఈ డీల్‌కు ముగింపునకు ట్రాన్సామెరికా, టీసీఎస్ పరస్పరం అంగీకరించాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) తాజా నివేదికల ప్రకారం రానున్న 24-30 నెలల్లో ఈ ట్రాన్సిషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. కాంట్రాక్ట్ పదేళ్లలో ఎనిమిదేళ్లు పూర్తి చేస్తుందని, దీనిపై తమపై ఆర్థిక ప్రభావం తక్కువేనని టీసీఎస్ వెల్లడించింది. కాగా టీసీఎస్ సీఈవోగా రాజేష్ గోపీనాథన్ రాజీనామా తరువాత జూన్ 1న బాధ్యతలు స్వీకరించిన కె. కృతివాసన్‌కి ఇది పెద్ద సవాలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. (అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!) ట్రాన్సామెరికా అనేది శాన్-ఫ్రాన్సిస్కో-ఆధారిత ఆర్థిక సేవల సంస్థ. 2018, జనవరిలో కుదుర్చుకున్న ట్రాన్సామెరికా డీల్ కంపెనీ అతిపెద్ద కాంట్రాక్టులలో ఒకటిగా నిలిచింది. కాగ్నిజెంట్‌తో సహా ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సేవలు పోటీ పడగా టీసీఎస్ ఈ డీల్‌ను సొంతం చేసుకుంది. -
వేదాంతా – హిందుస్తాన్ జింక్ డీల్‌కు బ్రేక్!
న్యూఢిల్లీ: రుణ భారాలను తగ్గించుకోవాలని భావిస్తున్న బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అగర్వాల్ నియంత్రణలోని వేదాంతా తన అంతర్జాతీయ జింక్ వ్యాపారాన్ని (అసెట్స్) హిందుస్తాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్)కు 2.98 బిలియన్ డాలర్లకు విక్రయించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వ్యతిరేకించింది. విలువలకు సంబంధించి తలెత్తిన ఆందోళనలే దీనికి కారణం కావడం గమనార్హం. ఈ డీల్ ద్వారా తన దాదాపు 10 బిలియన్ డాలర్ల రుణ భారంలో కొంత తగ్గించుకోవాలన్న వేదాంతా ప్రయత్నానికి తాజా పరిణామం విఘాతంగా నిలుస్తోంది. చట్టపరమైన చర్యలకూ ప్రభుత్వం సిద్ధం ఆఫ్రికా ఆధారిత వ్యాపారాన్ని హిందుస్తాన్ జింక్‌కు విక్రయించడాన్ని నిలువరించడానికి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు హిందుస్తాన్ జింక్ లిమిటెడ్‌కు గనుల మంత్రిత్వశాఖ ఒక లేఖ రాస్తూ, ‘‘ఈ లావాదేవీకి సంబంధించి ప్రభుత్వం తన అసమ్మతిని పునరుద్ఘాటించాలనుకుంటోంది’’ అని పేర్కొంది. హిందుస్తాన్ జింక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఈ విషయాన్ని తెలిపింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి 29.54 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. మాతృ సంస్థ వేదాంతా నుంచి టీహెచ్ఎల్ జింక్ లిమిటెడ్ మారిషస్‌ను 2.98 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని హిందుస్తాన్ జింక్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతిపాదన ప్రకారం 18 నెలల్లో దశలవారీగా ఈ కొనుగోలు ప్రక్రియ జరగాల్సి ఉంది. జింక్, సీసం, వెండి సమీకృత ఉత్పత్తిదారు.. హిందుస్తాన్ జింక్‌లో వేదాంతాకు 64.92 శాతం వాటా ఉంది. కాగా.. మైనింగ్ శాఖ లేఖను బోర్డు ముందు ఉంచనున్నట్లు హిందుస్తాన్ జింక్ తాజాగా వెల్లడించింది. వేదాంతా గ్రూప్లోకెల్లా భారీ డివిడెండ్ల ద్వారా హెచ్‌జెడ్‌ఎల్ సంపన్న సంస్థగా నిలుస్తూ వస్తోంది. హిందుస్తాన్ జింక్ షేర్ ధర సోమవారం 1% తగ్గి, రూ.321 వద్ద స్థిరపడగా, వేదాంతా షేర్ ధర కూడా అంతే శాతం తగ్గి, రూ.311 వద్ద ముగిసింది. -
వెనక్కి తగ్గిన షకీబ్.. బెట్విన్నర్ న్యూస్‌తో ఒప్పందం రద్దు!
ఢాకా: బంగ్లాదేశ్ టాప్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు వివాదాలు కొత్త కాదు. తాజాగా ఒక స్పాన్సర్షిప్ ఒప్పందానికి సంబంధించి షకీబ్ చర్య వివాదంగా మారింది. అయితే చివరి నిమిషంలో షకీబ్ దానిని సరిదిద్దుకోవడంతో అతను వేటు తప్పించుకున్నాడు. పది రోజుల క్రితం ‘బెట్విన్నర్ న్యూస్’తో తాను ఒప్పందం చేసుకున్న విషయాన్ని షకీబ్ ఇన్‌స్టగ్రామ్ ద్వారా ప్రకటించాడు. అయితే బెట్విన్నర్ అనేది బెట్టింగ్‌కు సంబంధించిన సంస్థ కావడంతో అతను ఒప్పందం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఏ బంగ్లా క్రికెటర్ అయినా బెట్టింగ్ సంస్థతో ఒప్పందాలు చేసుకోరాదు. దాంతో షకీబ్‌పై చర్య తీసుకునేందుకు బీసీబీ సిద్ధమైంది. చివరి హెచ్చరికగా గురువారంలోగా దానిని రద్దు చేసుకోకపోతే బోర్డు కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. దాంతో షకీబ్ వెనక్కి తగ్గాడు. తన ఒప్పందాన్నివదిలేస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: AFG vs IRE: ఆఫ్ఘనిస్తాన్‌కు మరో షాకిచ్చిన ఐర్లాండ్.. వరుసగా రెండో విజయం! -
మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ ఈ వారంలోనూ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్–సౌదీ ఆరామ్కో ఒప్పందానికి బ్రేక్ పడింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణ భయాలు ఈక్విటీ మార్కెట్లను భయపెడుతున్నాయి. అంతర్జాతీయంగా కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం(ఈ నెల 25న) ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. ఈ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన గతవారంలో సూచీలు దాదాపు రెండుశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 1051 పాయింట్లు, నిఫ్టీ 338 పాయింట్లను కోల్పోయాయి. కార్పొరేట్ల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించినప్పటికీ.., అధిక వ్యాల్యూయేషన్ల కారణంగా మార్కెట్లో కన్సాలిడేషన్(స్థిరీకరణ)కొనసాగుతుంది. ప్రస్తుతం నిఫ్టీ 17,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. అమ్మకాలు జరిగితే 17,500 వద్ద మరో మద్దతు స్థాయి ఉంది. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలే సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి’’ అని సామ్కో రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. ట్రేడింగ్‌పై వ్యవసాయ చట్టాల రద్దు ప్రభావమెంత..? కొద్ది నెలలుగా కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య వివాదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర శుక్రవారం మోదీ ప్రకటించారు. ‘‘వాస్తవానికి మూడు చట్టాలు వ్యాపార అనూకూలమైనవి. ఈ చట్టాలు అమల్లో లేనందున ట్రేడింగ్‌పై పెద్దగా ఉండకపోవచ్చు. అయితే కేంద్రం అనూహ్యంగా వెనక్కి తగ్గడం, మార్కెట్లో నెలకొన్న అస్థిరత పరిస్థితుల దృష్ట్యా చట్టాల రద్దు అంశం ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు రిలయన్స్, సౌదీ ఆరామ్కో డీల్ కు మంగళం రిలయన్స్ – సౌది ఆరాకో ఒప్పందానికి మరోసారి బ్రేక్ పడింది. సౌదీ అరామ్కోకు తన 20 శాతం వాటా విక్రయ ఒప్పందాన్ని మరోసారి మూల్యాంకనం చేయాలని నిర్ణయించుకున్నట్లు రిలయన్స్ ఎక్సే్చంజీలకు సమాచారం ఇచ్చింది. ఒప్పంద రద్దు ధీర్ఘకాలంలో రిలయన్స్ షేరుపై పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చని అయితే స్వల్పకాలం పాటు తీవ్ర ఒడిదుడుకులను లోనుకావచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. తన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ వ్యాపారాల్లో 20 శాతా వాటాను విక్రయించి, 15 బిలియన్ డాలర్లను సమీకరించాలని రిలయన్స్ భావించిన సంగతి తెలిసిందే. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఈ నెల 25న) నిఫ్టీ సూచీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
సౌదీ ఆరామ్‌కోకి గుడ్‌బై చెప్పిన రిలయన్స్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన పెట్రోకెమికల్ (ఓ2సీ) వ్యాపారంలో సౌదీ ఆరామ్కో ప్రతిపాదిత పెట్టుబడుల డీల్ రద్దయింది. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని విలువను మరోసారి మదింపు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించుకున్నాయి. ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల విషయంలో సౌదీ ఆరామ్కో తమకు ప్రాధాన్య భాగస్వామిగా కొనసాగుతుందని రిలయన్స్ (ఆర్ఐఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. 2019 ఆగస్టులో రిలయన్స్ తమ ఓ2సీ వ్యాపారం విలువను 75 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. దీన్ని ప్రత్యేక విభాగంగా కూడా విడగొట్టాలని భావించింది. నిర్దిష్ట ప్రతిపాదనల ప్రకారం ఓ2సీ విభాగంలో సౌదీ ఆరామ్కో సంస్థకు 15 బిలియన్ డాలర్లకు 20 శాతం వాటాలు విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకు ముందుగా 2020 మార్చి డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి కాగలదని ప్రకటించింది. అయితే, ఈలోగా పర్యావరణ హిత ఇంధనాల ఉత్పత్తి దిశగా కంపెనీ కొత్తగా భారీ ప్రణాళికలు ప్రారంభించడం, క్రమంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, ఓ2సీని ప్రత్యేక విభాగంగా విడగొట్టే ప్రతిపాదనను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి రిలయన్స్ వెనక్కి తీసుకుంది. ఈ అంశాల నేపథ్యంలో తాజాగా రిలయన్స్ ఓ2సీ విభాగంలో సౌదీ ఆరామ్కో పెట్టుబడుల ప్రతిపాదన రద్దు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిలయన్స్ బ్రాండ్స్‌తో వెస్ట్ ఎల్మ్ జట్టు.. ఫర్నిచర్, హోమ్ డెకరేషన్ ఉత్పత్తుల సంస్థ వెస్ట్ ఎల్మ్ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశించింది. ఇందుకోసం రిలయన్స్ బ్రాండ్స్‌తో చేతులు కలిపింది. జియో వరల్డ్ డ్రైవ్‌లో తొలి స్టోర్‌ను అక్టోబర్‌లో ప్రారంభించగా, గత వారం రెండో స్టోర్‌ను గుర్గావ్లో ఆరంభించింది. అటు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ఆశీష్ షాతో కూడా జట్టు కట్టింది. రిలయన్స్ బ్రాండ్స్ ఇప్పటికే దాదాపు 35 అంతర్జాతీయ బ్రాండ్స్‌ను దేశీ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టైల్స్‌లో 40 శాతం వాటాలు కొనుగోలు చేసింది. -
క్రోనస్ డీల్ రద్దు చేసుకున్న అరబిందో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రోనస్ ఫార్మా డీల్‌ను రద్దు చేసుకున్నట్టు అరబిందో ఫార్మా వెల్లడించింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ బోర్డ్ ఈ మేరకు సమ్మతి తెలిపింది. డీల్ రద్దు విషయమై ఇరు సంస్థలు పరస్పరం అంగీకరించాయని వివరించింది. పశువులకు సంబంధించి జనరిక్ ఔషధాల అభివృద్ధి, కాంట్రాక్ట్ రీసెర్చ్ సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియాలో 51 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్టు ఆగస్ట్ 12న అరబిందో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.420 కోట్లు. -
మైక్రోసాప్ట్కు షాక్; టాప్‌లోకి దూసుకొచ్చిన జెఫ్ బెజోస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థపాకుడు జెఫ్ బెజోస్ సంపద మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరింది. పెంటగాన్ కీలక ప్రకటనతో ఆయన ఆస్తులు కనీవినీ ఎరగని రీతిలో ఆకాశమే హద్దుగా దూసుకు పోయాయి. తద్వారా బెజోస్ నికరసంపద ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ప్రధానంగా అమెజాన్ షేర్లు 4.7 శాతం పెరగడంతో ఆయన నికర ఆస్తుల విలువ 211 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15.69 లక్షల కోట్లు) చేరడం విశేషం. ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ సంస్థతో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టును రద్దుచేసుకున్నట్లు పెంటగాన్ ప్రకటించడంతో అమెజాన్ షేర్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకొంది. 2019 లో మైక్రోసాఫ్ట్ సంస్థతో 10 బిలియన్ డాలర్ల క్లౌడ్-కంప్యూటింగ్ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు పెంటగాన్ మంగళవారం తెలిపింది. దీంతో షేర్లు అమాంతం పుంజుకున్నాయి. మంగళవారం అమెజాన్ షేర్ విలువ 8.4 బిలియన్ డాలర్ల మే లాభపడింది. ఈ ర్యాలీతో జెఫ్ బెజోస్ సంపదన 8.4 బిలియన్ డాలర్లు పుంజుకుంది. ఫలితంగా ఆయన నికర విలువ 211 బిలియన్ డాలర్లకు చేరింది. మాకెంజీ స్కాట్ : ఇచ్చిందంతా తిరిగొచ్చింది తాజా పరిణామంతో అటు బెజోస్ మాజీ భార్య ,ప్రపంచంలోని 15 వ రిచెస్ట్ పర్సన్ మాకెంజీ స్కాట్ సంపద ఏకంగా 2.9 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాదు ఈ సంవత్సరం ఇప్పటివరకు ఆమె దానం చేసిన 2.7 బిలియన్ల డార్లను మించిపోవడంమరో విశేషం. కాగా ఈ ఏడాది జనవరిలో 210 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ టాప్ ప్లేస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రికార్డును జెఫ్ బెజోస్ బద్దలుకొట్టి అపరకుబేరుడి రికార్డును మరోసారి చేజిక్కించుకున్నారు. 57 ఏళ్ల బెజోస్ 27 సంవత్సరాల సుదీర్ఘ కరియర్ తరువాత ఇటీవల అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకుని, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. -
Vaccine Corruption Scandal: బొల్సొనారోకు భారీ షాక్
కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోసుల కోసం భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం.. ఆపై ముడుపుల విమర్శలతో రద్దు చేసుకున్న పంచాయితీ బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. రాజకీయ ఒత్తిళ్లు, ప్రజా నిరసనల మధ్య బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు భారీ షాకిచ్చింది అక్కడి అత్యున్నత న్యాయస్థానం. ఈ భారీ కుంభకోణంలో బొల్సొనారోతో సహా కీలక పదవుల్లో ఉన్నవాళ్లను సైతం విచారించాలని దర్యాప్తు బృందాలను ఆదేశించింది బ్రెజిల్ సుప్రీం కోర్టు. సావ్ పాలో: కొవాగ్జిన్ డీల్‌కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై, ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు, బ్రెజిల్ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది. శుక్రవారం రాత్రి హడావిడిగా ఆదేశాలను జారీ చేసిన జస్టిస్ రోసా వెబర్.. 90 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని గడువు విధించారు. మరోవైపు బ్రెజిల్ కాగ్(సీజీయూ)ను ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరింది న్యాయస్థానం. తగ్గని ఆగ్రహజ్వాలలు కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడంటూ అధ్యక్షుడికి వ్యతిరేకంగా వేల మంది యాంటీ-బొల్సొనారో ఉద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనాతో ఐదు లక్షల మంది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడంటూ బొల్సొనారోపై హత్యాయత్నం కేసులు సైతం నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ ముడుపుల ఆరోపణలు రావడంతో వాళ్లలో మరింత ఆగ్రహం పెల్లుబిక్కింది. దీంతో మూడురోజులుగా రోడెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నారు. శనివారం సైతం పార్లమెంట్ ఆవరణలో వీళ్లు నిరసనలు చేపట్టారు. ఇక బొల్సొనారోను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. పాత-కొత్త ఆరోపణలు(కొవాగ్జిన్ డీల్ అంశం సహా), వివాదాలను ప్రస్తావిస్తూ ఈ వారంలోనే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. చదవండి: బొల్సొనారో రక్తపిశాచి.. జనాగ్రహంతో పెరిగిన కరోనా! అఘమేఘాల మీద రద్దు కాగా, ఈ ఫిబ్రవరిలో కొవాగ్జిన్ డోసుల కోసం బ్రెజిల్ ప్రభుత్వం భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకుంది. ఒక్కో డోస్‌కు 15 డాలర్ల చొప్పున.. సుమారు 2 కోట్ల డోసుల సరఫరాకు ఆ ఒప్పందం జరిగింది. ఈ డీల్ విలువ వేల కోట్లు కాగా, దాదాపు రూ.734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్తి కంపెనీ ప్రిసిసా మెడికంతోస్తో పాటు.. బొల్సొనారోకు సైతం ముట్టినట్టు ప్రతిపక్ష సెనేటర్లు ఆరోపించారు. అయితే ఈ డీల్‌లో ఆరోపణలతో తమకు సంబంధం లేదని భారత్ బయోటెక్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు ముందస్తు చెల్లింపులు తమకు జరగలేదని, ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని.. అయితే అత్యవసర అనుమతులు మాత్రం ఈమధ్యే జరిగాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఈలోపే బ్రెజిల్ ప్రభుత్వం ఒప్పందం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. చదవండి: వ్యాక్సిన్‌తో మొసళ్లుగా మారుతున్న మనుషులా? -
టిక్‌టాక్ రేసు నుంచి మైక్రోసాఫ్ట్ అవుట్
న్యూయార్క్: వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ అమెరికా విభాగాన్ని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దక్కించుకోలేకపోయింది. మైక్రోసాఫ్ట్‌కి విక్రయించరాదని చైనాకు చెందిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ నిర్ణయించుకుంది. అమెరికాలో తమ కార్యకలాపాల కోసం మరో ఐటీ దిగ్గజం ఒరాకిల్ను టెక్నాలజీ భాగస్వామిగా ఎంచుకుంది. మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపింది. ‘టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్‌కు విక్రయించబోమని బైట్‌డ్యాన్స్ తెలియజేసింది‘ అని పేర్కొంది. అయితే, ఇటు దేశ భద్రతను కాపాడుతూనే అటు టిక్‌టాక్ యూజర్లకు కూడా ప్రయోజనకరంగా ఉండేలా తాము కొనుగోలు ప్రతిపాదనను రూపొందించినట్లు వివరించింది. మరోవైపు, ఒరాకిల్ కేవలం టెక్నాలజీ భాగస్వామిగానే లేక టిక్‌టాక్‌లో మెజారిటీ వాటాలు కూడా కొనుగోలు చేస్తుందా అన్న విషయంపై స్పష్టత లేదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇది విక్రయ డీల్‌గా ఉండకపోవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. యూజర్ల డేటా భద్రతపై ఆందోళన నేపథ్యంలో టిక్‌టాక్‌ను సెప్టెంబర్ 20లోగా ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేసి వైదొలగాలని, లేకపోతే నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం తెలిసిందే. దీంతో రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌తో కలిసి మైక్రోసాఫ్ట్.. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు బరిలోకి దిగింది. అయితే, టెక్నాలజీ బదలాయింపు సమస్యగా మారింది. మరోవైపు, ఒరాకిల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్‌తో సన్నిహిత సంబంధాల కారణంగా ఆ కంపెనీకే టిక్‌టాక్‌ను అప్పగించే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. -
గందరగోళంలో బ్రెగ్జిట్
బ్రెగ్జిట్ పీటముడి మరింత జటిలమైపోయింది. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం బ్రిటన్ అక్టోబర్ 31కల్లా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాల్సి ఉండగా.. ప్రధాని బోరిస్ జాన్సన్ కాస్తా పార్లమెంటును సస్పెండ్ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒప్పందంలో మార్పులు జరిగితే బ్రిటన్ వైదొలగేందుకు తనకు అభ్యంతరం లేదని బోరిస్ అంటూండగా.. విపక్షాలు తమకు అనుకూలమైన మార్పులు జరిగితేనే వీడాలని పట్టుపడుతున్నాయి. లేదంటే బ్రిటన్‌కు ఆర్థికంగా నష్టమని హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ అక్టోబర్ 31లోగా బ్రెగ్జిట్ సాధ్యమేనా? అధికార, విపక్షల ముందున్న అవకాశాలు ఏంటి? రహస్య పద్ధతితో సాధిస్తారా? మెరుగైన ఒప్పందం లేకుండా విడిపోవడంపై పార్లమెంటు సభ్యులు అత్యధికుల్లో అభ్యంతరాలున్నాయి. కానీ ఇది జరక్కుండా ఉండాలంటే పార్లమెంటు పనిచేయాల్సి ఉంటుంది. పార్లమెంటు సస్పెన్షన్‌లో ఉన్న నేపథ్యంలో పరిస్థితులు జటిలంగా మారినా.. ప్రతిపక్ష నేతలు జో స్విన్సన్ లాంటి వాళ్లు తమ గళాన్ని పెంచారు. ఇటీవలి బీబీసీ ఇంటర్వ్యూలో లిబరల్ డెమొక్రాట్స్ నేత అయిన జో స్విన్సన్ మాట్లాడుతూ తామూ బోరిస్ జాన్సన్ మాదిరిగా ఒక సీక్రెట్ పద్ధతి ద్వారా తమకు కావాల్సింది సాధించుకుంటామని సూచించారు. అదేంటో ఇప్పటికి స్పష్టం కాకపోయినా... అనూహ్య పరిణామమేదైనా జరగవచ్చునని మాత్రం తెలుస్తోంది. తుది అస్త్రంగా అవిశ్వాసం... మెరుగైన బ్రెగ్జిట్ ఒప్పందంపై చట్టం చేయలేని పరిస్థితి ఏర్పడితే బోరిస్ జాన్సన్‌ను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రస్తుతానికి ఇందుకు తగ్గ బలం లేకపోగా.. దీనివల్ల సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకమూ లేదు. అవిశ్వాస తీర్మానం మేరకు ఒకవేళ బోరిస్ జాన్సన్ దిగిపోయినా రెండు వారాల్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పడటం, లేదంటే సాధారణ ఎన్నికలు నిర్వహించడం జరగాలని బ్రిటన్ చట్టాలు చెబుతూండటం దీనికి కారణం. ఆపద్ధర్మ ప్రధాని నియామకం ద్వారా బ్రెగ్జిట్‌ను వాయిదా వేసి ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ.. ఆపద్ధర్మ ప్రధాని ఎవరన్న అంశంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. లేబర్ పార్టీ తరఫున జెరెమీ కార్బిన్... ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి కావచ్చుగానీ... యూనియన్ వ్యతిరేకిగా ముద్ర ఉన్న కారణంగా అతడిని బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్న వారు ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ అన్నీ సవ్యంగా జరిగి ఆపద్ధర్మ ప్రధాని బాధ్యతలు చేపడతాడు అనుకుంటే.. బోరిస్ మరో ఎత్తు వేయవచ్చు. రాజీనామా చేయకుండా నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించవచ్చు. దీంతో మెరుగైన ఒప్పందం లేకుండానే అక్టోబర్ 31 తరువాత బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చేస్తుంది. ఒప్పందంతో బయటకు... థెరెసా మే ప్రధానిగా ఉండగా సిద్ధమైన ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఇప్పటికే మూడుసార్లు తిరస్కరించిన నేపథ్యంలో ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువే. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా మరోసారి చర్చలు లేవని భీష్మించుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17 –18లలో జరిగే యూనియన్ నేతల సమావేశం కీలకం కానుంది. ప్రధాని బోరిస్ ఏదో ఒక రకంగా యూనియన్ నేతలను ఒప్పించి ఒప్పందంలో మార్పులు తీసుకు వస్తే.. ఆ మార్పులను బ్రిటన్ పార్లమెంటు ఆమోదిస్తేనే బ్రిటన్‌కు నష్టదాయకం కాని ఒప్పందంతో బ్రెగ్జిట్ అమల్లోకి వస్తుంది. ఒప్పందం లేకుండానే వీడుతుందా..? మెరుగైన ఒప్పందం కుదుర్చుకునేందుకు బోరిస్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోతే ఒప్పందం లేకుండానే యూనియన్ను వీడేందుకు ఆయన సిద్ధం కావచ్చు. కాలపరిమితి కారణంగా పార్లమెంటు కూడా దీన్ని అడ్డుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒప్పందంలో మార్పులు జరిగినా, జరక్కపోయినా అక్టోబర్ 31 తరువాత బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో భాగం కాదు కాబట్టి. ఇదే జరిగితే జాన్సన్ బ్రెగ్జిట్ మద్దతుదార్లను కూడగట్టుకుని ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది మొదట్లో సాధారణ ఎన్నికలకు సిద్ధం కావచ్చు. కానీ యూనియన్ నుంచి వైదొలగిన తరువాతి ఆర్థిక పరిణామాల కారణంగా ఆ ఎన్నికలను గెలవడం బోరిస్‌కు కష్టం కావచ్చు. ముందస్తు ఎన్నికలు..? పార్లమెంటు సస్పెన్షన్ మొదలయ్యేలోపు ఎంపీలు అందరూ మెరుగైన ఒప్పందం లేకుండా బ్రెగ్జిట్ కుదరదని చట్టం చేయగలిగితే.. ఆ వెంటనే బోరిస్ జాన్సన్ సాధారణ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావచ్చు. ప్రస్తుతం ఒకే ఒక్క సభ్యుడి ఆధిక్యంతో సభ నడుస్తూండగా.. ఎన్నికలు జరిగితే జాన్సన్‌కు మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే అవి అక్టోబర్ 17 లోగానే జరగవచ్చునని తద్వారా బోరిస్ గెలిస్తే.. యూరోపియన్ యూనియన్ సదస్సుకు వెళ్లి తన బలాన్ని ప్రదర్శించవచ్చునని అంచనా. కానీ.. ఎన్నికలు నిర్వహించాలంటే హౌస్ ఆఫ్ కామన్స్‌లో మూడింట రెండు వంతుల మంది మద్దతు కావాల్సి ఉంటుంది. అంటే.. బోరిస్‌కు ప్రతిపక్ష నేతల సభ్యులు కొందరు మద్దతు పలకాలి. లేబర్ పార్టీ కూడా తక్షణ ఎన్నికలు కోరుకుంటున్నా బోరిస్‌పై ఉన్న అపనమ్మకం కారణంగా అతడికి మద్దతిచ్చే అవకాశాలు తక్కువే. న్యాయస్థానాలు నిర్ణయిస్తాయా? పార్లమెంటును సస్పెండ్ చేయడంపై ఇప్పటికే బ్రిటన్ న్యాయస్థానాల్లో మూడు కేసులు నమోదయ్యాయి. గతంలో పార్లమెంటును కాదని యూనియన్‌తో చర్చలకు సిద్ధమైన థెరెసా మే నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేసి గెలుపొందిన గినా మిల్లర్ ఇప్పుడు కూడా బోరిస్ నిర్ణయాన్ని సవాలు చేస్తున్నారు. దీంతో బ్రెగ్జిట్ బంతి బ్రిటన్ కోర్టులో పడిపోతుంది! -
అమెరికా సైన్యంతో గూగుల్ ఒప్పందం రద్దు!
శాన్ఫ్రాన్సిస్కో: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అమెరికా సైన్యంతో చేసుకున్న ఓ ఒప్పందం నుంచి వైదొలగనుంది. ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ గూగుల్ ఉద్యోగులు నిరసన తెలపడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రాజెక్ట్ మావెన్’అనే ప్రాజెక్టు కోసం అమెరికా సైన్యం గూగుల్‌తో జతకట్టింది. డ్రోన్లు తీసే వీడియోల్లో ఉన్నది మనుషులా లేక వస్తువులా అనేదాన్ని గుర్తించేందుకు మానవ ప్రమేయం లేకుండా కృత్రిమ మేధస్సును వాడటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యుద్ధ సంబంధ ప్రాజెక్టులను గూగుల్ చేపట్టకూడదంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ‘మనుషులు, వస్తువుల మధ్య తేడాలను కృత్రిమ మేధస్సు గుర్తిస్తే, మానవ ప్రమేయం లేకుండా మనుషులను డ్రోన్లే యుద్ధంలో హతమార్చే రోజు రావొచ్చు. అది చాలా ప్రమాదకరం. దీనిపై అంతర్జాతీయంగా విస్తృత చర్చ జరగాల్సి ఉంది’ అని ఐసీఆర్ఏసీ అనే సంస్థ పేర్కొంది. ఉద్యోగుల నిరసనతో గూగుల్ దిగొచ్చింది. -
ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా
వాషింగ్టన్: ఏడు దేశాలు రెండేళ్లపాటు చర్చోపచర్చలు జరిపిన తర్వాత 2015లో సాకారమైన చారిత్రక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు ఉత్పత్తి చేయకుండా నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీవోఏ)ను ‘క్షీణించిన, కుళ్లినది’గా అభివర్ణించే ట్రంప్.. తాను అధికారంలోకి వస్తే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తానని 2016లో ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. చెప్పినట్లుగానే జేసీపీవోఏ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు మంగళవారం ట్రంప్ ప్రకటించారు. తననిర్ణయంతో అమెరికా మిత్రదేశాలతోనూ విభేదాలు తెచ్చుకున్నారు. అమెరికాతో సంబంధం లేకుండా తాము ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామనీ, ఇరాన్ కూడా అలాగే చేయాలని ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా, జర్మనీ ప్రకటించాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలతోపాటు జర్మనీ కూడా కలసి ఇరాన్‌తో రెండేళ్లపాటు చర్చలు జరిపిన అనంతరం 2015లో వియన్నాలో జేసీపీవోఏ ఒప్పందం కుదరడం విదితమే. అణు కార్యక్రమాలను నిలిపివేసినందుకుగాను అప్పటివరకు ఇరాన్‌పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తేశారు. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ద్వారా ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయ చట్టంగా కూడా గుర్తించారు. ‘మనం ఇరాన్ అణు బాంబును నియంత్రించలేమనేది నాకు స్పష్టంగా తెలుసు. ఈ ఒప్పందం మూలంలోనే లోపాలు ఉన్నాయి. కాబట్టే దీని నుంచి అమెరికా తప్పుకుంటున్నదని నేను ప్రకటిస్తున్నాను’ అని ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించారు. ట్రంప్ నిర్ణయ ప్రభావమెంత? అమెరికాప్రకటించిన ఆంక్షలు ఇరాన్ ఆటోమొబైల్ రంగంపై మూడు నెలల తర్వాత, చమురు రంగంపై ఆరు నెలల తర్వాత అమల్లోకి వస్తాయి. కాబట్టి అంతర్జాతీయ చమురు ధరలు వేగంగా పెరిగే అవకాశాల్లేవు. అమెరికా మిత్ర దేశాలు అనేకం ఇరాన్ నుంచి ముడి చమురు కొంటున్న నేపథ్యంలో అవి అమెరికాను అనుసరిస్తూ కొనుగోళ్లు తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఈ మిత్రదేశాల బ్యాంకులపై అమెరికా ఆరు నెలల తర్వాత ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. అందుకే అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఐరోపా మిత్రదేశాలు కోరుతున్నాయి. ట్రంప్ నిర్ణయం వల్ల మిత్ర దేశాలైన ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీలు అమెరికాకు దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. భారత్‌పై తక్షణ ప్రభావం ఉండదు: ఇరాన్‌పై అమెరికా పునరుద్ధరించిన ఆర్థిక ఆంక్షలను ఐరోపా దేశాలు పాటించనంత వరకు భారత ముడిచమురు దిగుమతులపై ప్రభావం ఉండదని భారత అధికారులు వెల్లడించారు. -
ఫైజర్-అలెర్గాన్ డీల్ రద్దు!
♦ అమెరికాలో పన్ను నిబంధనల మార్పే కారణం ♦ జనరిక్ వ్యాపారాన్ని విడదీయటంపై త్వరలో ఫైజర్ నిర్ణయం ♦ తెవా ఫార్మాకు జనరిక్స్‌ను విక్రయిస్తాం: అలెర్గాన్ న్యూయార్క్: ఇరు కంపెనీల విలీనానికి సంబంధించి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్- ఐర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న అలెర్గాన్ కుదుర్చుకున్న ఒప్పం దం రద్దయింది. 160 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్‌ను అంతర్జాతీయ ఫార్మా రంగంలో అతిపెద్ద డీల్‌గా పేర్కొనటం తెలిసిందే. ప్రధానంగా అమెరికాలోని పన్నుల్ని తప్పించుకోవటానికి ఫైజర్ తన కేంద్రాన్ని ఐర్లాండ్‌కు తరలించడానికి ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా పన్నుల రూపంలో ఏటా బిలియన్ డాలర్లకుపైగా మిగులుతాయని ఫైజర్ భావించింది. అయితే ఇలాంటి డీల్స్‌ను అడ్డుకునేలా ఒబామా యంత్రాంగం ఇన్వర్షన్స్ పేరిట కొత్త పన్ను నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. జనరిక్స్ వ్యాపారాన్ని విడదీయాలని యోచించిన ఫైజర్... అలెర్గాన్ డీల్ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని 2019 వరకూ వాయిదా వేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. తాజా పరిణామంతో.. ఈ ఏడాదిలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలియజేసింది.