న్యూఢిల్లీ: ప్రతిపాదిత విలీన డీల్‌ను రద్దు చేసుకోవాలన్న సోనీ నిర్ణయంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించినట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్ (జీల్) వెల్లడించింది. అలాగే 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 748.5 కోట్లు) టెరి్మనేషన్ ఫీజు కట్టాలన్న సోనీ నోటీసులపై కూడా తగు చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వివరించింది.
రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ సమాచారమిచ్చింది. జపాన్‌కి చెందిన సోనీ గ్రూప్ భారత విభాగం (కల్వర్ మ్యాక్స్), జీల్ విలీన ప్రతిపాదన రద్దయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల కథనాల ప్రకారం విలీన కంపెనీ సారథ్య బాధ్యతలను జీ సీఈవో పునీత్ గోయెంకాకు అప్పగించడాన్ని ఇష్టపడకపోవడం వల్ల సోనీ గ్రూప్ ఈ డీల్‌ను రద్దు చేసుకుంది.
ఆర్థిక మంత్రికి సుభాష్ చంద్ర లేఖ..
విలీన డీల్ నుంచి సోనీ వైదొలగడానికి కొద్ది రోజుల ముందు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర లేఖ రాశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఈ ఒప్పందం కుదరకుండా చేసేందుకు ప్రయతి్నస్తోందంటూ అందులో ఆరోపించారు.
జీ నిధులను దురి్వనియోగం చేశారంటూ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకాపై సెబీ చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో సెబీ విచారణ జరపరాదని తాను అనడం లేదని, కాకపోతే సరిగ్గా డీల్ కుదిరే సమయంలో సెబీ ఇందుకు సంబంధించిన నోటీసులివ్వడానికి కారణమేమిటనేదే తన ఆందోళన అని చంద్ర పేర్కొన్నారు. జీల్ మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్థిక మంత్రి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యరి్ధంచారు.
Comments
Please login to add a commentAdd a comment