Law Tribunal
-
సోనీపై ఎన్సీఎల్టీకి జీ
న్యూఢిల్లీ: ప్రతిపాదిత విలీన డీల్‌ను రద్దు చేసుకోవాలన్న సోనీ నిర్ణయంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించినట్లు జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) వెల్లడించింది. అలాగే 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 748.5 కోట్లు) టెరి్మనేషన్ ఫీజు కట్టాలన్న సోనీ నోటీసులపై కూడా తగు చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ సమాచారమిచ్చింది. జపాన్‌కి చెందిన సోనీ గ్రూప్ భారత విభాగం (కల్వర్ మ్యాక్స్), జీల్ విలీన ప్రతిపాదన రద్దయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల కథనాల ప్రకారం విలీన కంపెనీ సారథ్య బాధ్యతలను జీ సీఈవో పునీత్ గోయెంకాకు అప్పగించడాన్ని ఇష్టపడకపోవడం వల్ల సోనీ గ్రూప్ ఈ డీల్‌ను రద్దు చేసుకుంది. ఆర్థిక మంత్రికి సుభాష్ చంద్ర లేఖ.. విలీన డీల్ నుంచి సోనీ వైదొలగడానికి కొద్ది రోజుల ముందు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర లేఖ రాశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఈ ఒప్పందం కుదరకుండా చేసేందుకు ప్రయతి్నస్తోందంటూ అందులో ఆరోపించారు. జీ నిధులను దురి్వనియోగం చేశారంటూ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకాపై సెబీ చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో సెబీ విచారణ జరపరాదని తాను అనడం లేదని, కాకపోతే సరిగ్గా డీల్ కుదిరే సమయంలో సెబీ ఇందుకు సంబంధించిన నోటీసులివ్వడానికి కారణమేమిటనేదే తన ఆందోళన అని చంద్ర పేర్కొన్నారు. జీల్ మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్థిక మంత్రి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యరి్ధంచారు. -
దివాలా పరిష్కారాలు అంతంతే
ముంబై: కంపెనీ చట్ట ట్రిబ్యునళ్లలో దాఖలైన దివాలా కేసులు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికం(క్యూ3)లో అంతంతమాత్రంగానే పరిష్కారమయ్యాయి. వెరసి క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో దివాలా పరిష్కారాలు(రిజల్యూషన్లు) 15 శాతంగా నమోదయ్యాయి. ఇన్సాల్వెన్సీ, దివాలా బోర్డు(ఐబీబీఐ) గణాంకాల ప్రకారం 267 దివాలా కేసులలో 15 శాతమే రిజల్యూషన్ల స్థాయికి చేరాయి. ఇక క్లెయిమ్ చేసిన రుణాలలో 27 శాతమే రికవరీ అయినట్లు గణాంకాలు వెల్లడించాయి. 45 శాతం కేసులు లిక్విడేషన్ ద్వారా ముగిసినట్లు ఐబీబీఐ గణాంకాలను విశ్లేషించిన కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. త్రైమాసికవారీగా చూస్తే ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో కేసులు 256కు దిగివచ్చాయి. 2019–20లో నమోదైన 2,000 కేసుల రన్‌రేట్‌తో పోలిస్తే భారీగా తగ్గాయి. కాగా.. ఎలాంటి రిజల్యూషన్ ప్రణాళికలు లభించకపోవడంతో లిక్విడేషన్లలో మూడో వంతు కేసులు ముగిసినట్లు కొటక్ విశ్లేషణ వెల్లడించింది. మొత్తం 1,901 కేసులు పరిష్కారంకాగా.. 1,229 కేసులు లిక్విడేషన్కే బ్యాంకర్లు ఓటేశారు. మరో 600 కేసులలో ఎలాంటి పరిష్కార ప్రణాళికలూ దాఖలు కాలేదు. 56 కేసుల విషయంలో నిబంధలకు అనుగుణంగాలేక తిరస్కరణకు గురికాగా.. 16 కేసుల్లో పరిష్కార ప్రొవిజన్లకు రుణదాతలు అనుమతించలేదు. ఇక లిక్విడేషన్ కేసులలో 76 శాతం కంపెనీ మూతపడటం లేదా ఆర్థిక పునర్వ్యవస్థీకరణ(బీఐఎఫ్ఆర్) వల్ల నమోదుకాగా.. మిగిలినవి ఇతర కారణాలతో జరిగినట్లు కొటక్ వివరించింది. కేసుల పరిష్కారం ఆలస్యమవుతున్నప్పటికీ 2021 క్యూ2 (కరోనా మహమ్మారి కాలం)తో పోలిస్తే తగ్గినట్లే. 270 రోజులకుపైగా ఈ ఏడాది క్యూ3లో దాఖలైన కేసులలో 64% 270 రోజులను దాటేశాయి. మరో 14% కేసులు నమోదై 180 రోజులైంది. వెరసి లిక్విడేషన్ కేసులు అధికమయ్యే వీలున్నట్లు కొటక్ విశ్లేషించింది. రుణ పరిష్కార సగటు 590 రోజులుగా తెలియజేసింది. కొత్త కేసుల విషయంలో 50 శాతంవరకూ నిర్వాహక రుణదాతలు చేపడుతుంటే, 40 శాతం ఫైనాన్షియల్ క్రెడిటర్లకు చేరడం క్యూ3లో కనిపిస్తున్న కొత్త ట్రెండుగా తెలియజేసింది. తాజా త్రైమాసికంలో దాఖౖ లెన కేసులలో 42 శాతం తయారీ రంగం నుంచికాగా, 18 శాతం రియల్టీ, 13 శాతం రిటైల్, హోల్‌సేల్ వాణిజ్యం, 7 శాతం నిర్మాణం నుంచి నమోదయ్యాయి. ఐబీసీ ప్రాసెస్ తొలి నాళ్లలో భారీ కార్పొరేట్ కేసులు అధికంగా నమోదుకాగా.. ప్రస్తుతం దేశీ కార్పొరేట్ పరిస్థితులు పటిష్ట స్థితికి చేరుతు న్నట్లు విశ్లేషణ పేర్కొంది. కొత్త కేసులలో కరోనా మహమ్మారి ప్రభావంపడిన మధ్య, చిన్నతరహా సంస్థల నుంచి నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఐబీసీ ద్వారా మొత్తం రుణ పరిష్కార విలువ రూ. 8.3 లక్షల కోట్లకు చేరగా.. ఫైనాన్షియల్ క్రెడిటర్లు 73 శాతం హెయిర్‌కట్‌ను ఆమోదించాయి. -
బ్యాంకులకు ‘వీడియోకాన్’ లో 8 శాతం వాటాలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కుదేలైన వీడియోకాన్ గ్రూప్‌లోని 11 అనుబంధ కంపెనీల విలీనంతో ఏర్పడే సంస్థలో ఆర్థిక రుణదాతలకు 8 శాతం వాటా లభించనుంది. వీడియోకాన్ కొనుగోలు కోసం ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళిక ప్రకారం.. లిస్టెడ్ కంపెనీలైన వీడియోకాన్ ఇండస్ట్రీస్ (వీఐఎల్), వేల్యూస్ ఇండస్ట్రీస్ (వీఏఐఎల్)ను డీలిస్ట్ చేస్తారు. ఆ తర్వాత వీఏఐఎల్ సహా గ్రూప్‌లోని 11 సంస్థలను వీడియోకాన్ ఇండస్ట్రీస్‌లో విలీనం చేస్తారు. అయితే, వీడియోకాన్ టెలికం మాత్రం అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. వీఐఎల్ మొత్తం షేర్లలో 8 శాతాన్ని రుణదాతలకు నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం కేటాయిస్తారు. వీఐఎల్, వీఏఐఎల్ డీలిస్టింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, వీడియోకాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో డీలిస్టింగ్‌కు సంబంధించి ఈ రెండు సంస్థల షేర్హోల్డర్లకు దక్కేదేమీ లేదు. వీడియోకాన్ టేకోవర్‌కు మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కి చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సమర్పించిన రూ. 2,962 కోట్ల ప్రణాళికకు జూన్ 9న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. చదవండి: తల్లిదండ్రులారా జాగ్రత్త, మీ పిల్లల ఫోన్లపై కన్నేయండి -
దివాలా వార్తలపై క్లారిటీ ఇచ్చిన లింగమనేని
సాక్షి, హైదరాబాద్: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు వచ్చిన కథనాలపై ఆ కంపెనీ అధినేత లింగమనేని రమేశ్ క్లారిటీ ఇచ్చారు. లింగమనేని ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు ప్రకటించాలని తాము కోరలేదని తెలిపారు. జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఎయిర్ కోస్తా ఒప్పందంలో కొన్ని సమస్యలొచ్చాయని, వాటిని పరిష్కరించుకునేలోపే సదరు సంస్థ.. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసిందని లింగమనేని రమేశ్ చెప్పుకొచ్చారు. జర్మన్ సంస్థ పిటిషన్ ఆధారంగా కంపెనీ లా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ వ్యవహారంతో ఎల్ఈపీఎల్లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమ ఆర్ధిక పరిస్థితులు బాగాలేవంటూ వచ్చిన కథనాలను తోసిపుచ్చిన ఆయన.. ఆర్థికంగా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. గతంలో తమ రుణదాతలకు చెల్లింపులు చేయలేని పరిస్ధితి ఎప్పుడూ లేదని అన్నారు. 1996లో విజయవాడలో రిజిస్టరైన లింగమనేని రమేశ్‌కు చెందిన ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు ఈ నెల 14న కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలైంది. తీసుకున్న రుణాలు చెల్లించలేనంటూ లింగమనేని కంపెనీ చేతులెత్తేయడంతో రుణాలు ఇచ్చిన కంపెనీలకు ఈ నెల 29 వరకు ఎన్సీఎల్టీ అనుమతి ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. లింగమనేనికి చెందిన ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దివాలాకు సంబంధించి దినపత్రికల్లో ప్రచురితమైన బహిరంగ ప్రకటన ఇది -
12,000 దివాలా కేసులు దాఖల్డు
న్యూఢిల్లీ: దివాలా చట్టం అమలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 12,000 కేసులు దాఖలయ్యాయని కంపెనీ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. వీటిల్లో రూ.2 లక్షల కోట్ల సొమ్ములతో ముడిపడిన 4,500 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. 1500 కేసులను విచారించనున్నారని, మరో 6,000 కేసులు విచారణ కోసం వరుసలో వేచి ఉన్నాయని వివరించారు. కేసుల పరిష్కారానికి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ) చివరి అవకాశమని పేర్కొన్నారు. దివాలా కేసుల పరిష్కారానికి ఎన్సీఎల్టీ సాహసోపేతంగా వ్యవహరిస్తోందని వివరించారు. సీఐఐ, బ్రిటిష్ హై కమిషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రికవరీలో మంచి ఫలితాలు.... పెద్ద కేసులు పరిష్కారం కావడానికి 270కి మించిన రోజులు పడుతోందని, కొన్ని కేసులకు దీనికి రెట్టింపు సమయం కూడా పట్టొచ్చని, అయితే రికవరీ విషయంలో మంచి ఫలితాలే వస్తున్నాయని వివరించారు. ఎస్సార్ కేసు విషయంలో రూ.42,000 కోట్లు రికవరీ అయ్యాయని తెలిపారు. ఐబీసీ అమల్లోకి రాకముందు పెద్ద కేసుల పరిష్కారానికి నాలుగు నుంచి ఐదేళ్లు పట్టేదని, ఇప్పుడు ఒకటి, రెండేళ్లలోనే కేసులు పరిష్కారమవుతున్నాయన్నారు. సీఒసీ కీలక పాత్ర.... దివాలా ప్రక్రియలో రుణదాతల కమిటీ(సీఓసీ)ది కీలకమైన బాధ్యత అని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ)చైర్మన్ ఎమ్.ఎస్. సాహూ వ్యాఖ్యానించారు. కంపెనీ మనుగడ సాగిస్తుందో, లేదో గుర్తించడం, తగిన రిజల్యూషన్ ప్లాన్‌ను రూపొందించడం వంటి కీలక బాధ్యతలను సీఓసీ నిర్వర్తించాల్సి ఉంటుందని వివరించారు. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేద్దామా..
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) సంక్షోభం మరింత విస్తరించకుండా సమస్య పరిష్కారానికి కొత్త బోర్డు పలు మార్గాలు పరి శీలిస్తోంది. ఆర్థికంగా బలమైన ఇన్వెస్టరుకు సంస్థను గంపగుత్తగా విక్రయించడం ద్వారా వ్యాపారాన్ని నిలబెట్టాలన్న ప్రతిపాదన కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు కంపెనీ కొత్త బోర్డు బుధవారం సమర్పించబోయే ప్రణాళికల్లో ఇది ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యాపారాలను వివిధ విభాగాలుగా విడగొట్టి వేర్వేరుగా విక్రయించడం లేదా ఏకమొత్తంగా అమ్మేయాల్సిన అవసరం రాకుండా గ్రూప్ స్థాయిలో తగినంత నిధులను సమకూర్చడం తదితర ప్రతిపాదనలు వీటిలో ఉన్నట్లు వివరించాయి. రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ పలు లోన్లను తిరిగి చెల్లించడంలో విఫలం కావడం, అది మార్కెట్లపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం తెలిసిందే. కంపెనీ ఖాతాల ప్రకారం మార్చి 2018 నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ దాదాపు రూ. 63,000 కోట్ల రుణం తీసుకుంది. కంపెనీ వ్యవహారాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) విచారణ జరుపుతోంది. సంస్థను గాడిన పెట్టేందుకు కేంద్రం ప్రముఖ బ్యాంకరు ఉదయ్ కొటక్ సారథ్యంలో కొత్త బోర్డును నియమించింది. ఈ బోర్డు అక్టోబర్ 31న తగు పరిష్కార ప్రణాళికను ఎన్సీఎల్టీకి సమర్పించాల్సి ఉంది. కంపెనీ వ్యవహారాలపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ రుణాల చెల్లింపు కోసం నిధులను సమీకరించుకునే దిశగా ప్రధాన, ప్రధానేతర వ్యాపారాలను విక్రయించే అంశాన్ని బోర్డు పరిశీలించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మిస్త్రీకి దక్కని ఊరట!
• మధ్యంతర ఆదేశాల జారీకి కంపెనీ లా ట్రిబ్యునల్ తిరస్కరణ • జనవరి 31, ఫిబ్రవరి 1న విచారణ • నెలలో విచారణ ముగించి ఆదేశాల జారీకి సమ్మతి • స్పందన తెలియజేయాలని టాటాసన్స్కు ఆదేశాలు ముంబై: మధ్యంతర ఆదేశాలు కోరుతూ టాటా గ్రూపుపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సైరస్ మిస్త్రీకి నిరాశ ఎదురైంది. టాటా గ్రూపు చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ ఆ తర్వాత గ్రూపు నిర్వహణ లోపాలపై సంచలన ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. అనూహ్యంగా టాటా గ్రూపు కంపెనీల బోర్డు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన మిస్త్రీ మరుసటి రోజే కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్Sతోపాటు, మిస్త్రీ కుటుంబానికే చెందిన స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో విచారణ జరిపేందుకు ట్రిబ్యునల్ డివిజన్ బెంచ్ అంగీకరించింది. అయితే, ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉపశమనం కల్పించాలన్న పిటిషనర్ వినతిని పరిశీలించబోమని... అసలు మధ్యంతర చర్యలను అనుమతించబోమని స్పష్టం చేసింది. వారంలోగా పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని సైరస్ పల్లోంజి మిస్త్రీని బెంచ్ కోరింది. అలాగే, 15 రోజుల్లోగా స్పందన తెలియజేయాలని టాటా సన్స్, పిటిషన్లో ఇతర ప్రతివాదులను ఆదేశించింది. తాత్కాలిక ఉపశమనంపై విచారణకు తిరస్కరించిన డివిజన్ బెంచ్... విచారణను వేగంగా పూర్తి చేసి ఓ నెలలో ఆదేశాలు జారీకి అంగీకరించడం పిటిషనర్లకు దక్కిన కొంచెం ఊరటగా చెప్పుకోవచ్చు. రతన్ టాటాను బోర్డుకు దూరంగా ఉంచాలి... కంపెనీ లా బోర్డు (ఎన్సీఎల్టీ)లో మిస్త్రీ కుటుంబ నిర్వహణలోని కంపెనీలు సెక్షన్ 241, 242 కింద పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం డివిజన్‌బెంచ్ ముందు ఈ పిటిషన్ విచారణకు రాగా, దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎ.సుందరం తన వాదనలు వినిపించారు. పిటిషన్‌పై విచారణ జరిగేంత వరకు సైరస్ మిస్త్రీని టాటా సన్స్ (టాటా గ్రూపు కంపెనీల నిర్వహణ సంస్థ) బోర్డు, ఇతర టాటా గ్రూపు కంపెనీల నుంచి తొలగించకుండా... గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్‌టాటా, టాటాసన్స్ను ఆదేశించాలని ట్రిబ్యునల్‌ను కోరారు. రతన్ టాటా బోర్డు సమావేశాలకు హాజరు కాకుండా, టాటా సన్స్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా నిరోధిస్తూ తాత్కాలిక ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించి... వారి సారధ్యంలో కొత్తగా స్వతంత్ర డైరెక్టర్లను నియమించాలని కూడా కోరారు. అలాగే, టాటా సన్స్‌లో పిటిషనర్ల (మిస్త్రీ కుటుంబం)కు ప్రస్తుతం ఉన్న వాటాను తగ్గించే దిశగా కొత్తగా ఎలాంటి సెక్యూరిటీలను జారీ చేయకుండా టాటా సన్స్‌ను ఆదేశించాలని పేర్కొన్నారు. టాటా సన్స్‌లో మిస్త్రీ కుటుంబానికి చెందిన పల్లోంజీ గ్రూపునకు 18 శాతం వాటా ఉంది. టాటాసన్స్ అణచివేత ధోరణిని ప్రశ్నిస్తూ... మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించే విషయంలో టాటా కంపెనీలు, నాన్ ప్రమోటింగ్ డైరెక్టర్ల మద్దతు లేకపోయినా టాటా సన్స్ సెక్షన్ 169 కింద ప్రత్యేక నోటీసు జారీ చేయడం ముసుగు దాడిగా పిటిషనర్ పేర్కొన్నారు. సైరస్ పీ మిస్త్రీ, నుస్లీ వాడియాలు చేసిన ఆరోపణలను ఇంతవరకు ప్రతివాదులు ఖండించలేదని న్యాయవాది సుందరం ట్రిబ్యునల్‌కు వివరించారు. అయితే, టాటా సన్స్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్సింఘ్వి మాత్రం పిటిషనర్ల ఆరోపణలు ఆధారరహితమని పేర్కొన్నారు. దీనిపై ట్రిబ్యునల్ ఆదేశిస్తే స్పందన దాఖలు చేస్తామన్నారు. నోటీసు లేకుండా తప్పించారు... ‘‘ముందస్తు నోటీసు ఇవ్వకుండా టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మిస్త్రీని తొలగించారు. అసలు కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించలేదు. నుస్లీ వాడియా సహా టాటా గ్రూపు లిస్టెడ్ కంపెనీల్లో పలువురు స్వతంత్ర డైరెక్టర్లను సైతం ఇదే విధంగా అణచివేసే ప్రయత్నం జరిగింది. టాటా సన్స్‌లో టాటా ట్రస్టీల పాత్రపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలి. అలాగే, టాటా సన్స్, టాటా గ్రూపు కంపెనీల్లో వీరిని జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలి. టాటాసన్స్, సి.శివశంకరన్, అతని వ్యాపార సంస్థల మధ్య... మెహ్లీమిస్త్రీ, అతని అనుబంధ కంపెనీలతో జరిగిన అన్ని లావాదేవీలు, వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ కోసం స్వతంత్ర ఆడిటర్‌ను నియమించాలి. అలాగే, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. ‘మిస్త్రీని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తప్పించేందుకు టాటా సన్స్... టాటామోటార్స్ షేర్లను కొనుగోలు చేయడం వల్ల రూ.158.65 కోట్ల నష్టం వాటిల్లింది. ఇది మిస్త్రీని బయటకు పంపేందుకు వీలుగా టాటా మోటార్స్‌లో టాటా సన్స్ తన ఓటింగ్ బలాన్ని పెంచుకునేందుకే. టాటాసన్స్, వాటాదారుల ప్రయోజనాల కోసం కాదు. ఈ నిధులను వెనక్కి తీసుకోవాలని టాటా సన్స్‌ను ఆదేశించాలి’’ అని పిటిషన్లో మిస్త్రీ కుటుంబ కంపెనీలు కోరాయి. అలాగే, రతన్‌టాటా, ఎన్ఏ సూనవాలా తదితరులు ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ఇన్స్పెక్టర్ను నియమించాలని ట్రిబ్యునల్‌ను కోరడం గమనార్హం. టాటా స్టీల్ బోర్డు నుంచి నుస్లీవాడియా ఔట్ న్యూఢిల్లీ: టాటా స్టీల్ కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న నుస్లీవాడియాను తొలగించింది. వాడియాను తొలగించే తీర్మానంపై మెజారిటీ వాటాదారులు అనుకూలంగా ఓటు వేశారు. మొత్తం 97.12 కోట్ల షేర్లకు గాను 62.54 శాతం వాటాలకు సంబంధించిన ఓట్లు పోలయ్యాయని, ఇందులో మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి అనుకూలంగా 56.79 కోట్లు (90.80).. వ్యతిరేకంగా 5.75 కోట్ల ఓట్లు (9.20%) వచ్చాయని టాటా స్టీల్ బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. టాటా స్టీల్‌లో ప్రమోటర్ అయిన టాటా సన్స్, ఇతర ప్రమోటింగ్ కంపెనీలకు కలిపి మొత్తం 30.45 కోట్ల షేర్లున్నాయి. ఇందులో వాడియాను తొలగించే తీర్మానంపై 29.59 కోట్ల వాటాలకు సంబంధించిన ఓట్లు నమోదైనట్లు టాటా స్టీల్ తెలిపింది. ప్రమోటర్లను మినహాయించి చూసినా... సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లలో నాలుగింట మూడొం తుల ఇన్వెస్టర్లు వాడియాను తొలగించాలని ఓటు వేసినట్టు పేర్కొంది. సైరస్ మిస్త్రీ, నుస్లీ వాడియాలను బోర్డు నుంచి తొలగించేందుకు టాటా కెమికల్స్ ఈజీఎం ఏర్పాటు చేయగా, మిస్త్రీ ఇంతకుముందే రాజీనామా చేయడంతో వాడియాను తొలగించే తీర్మానంపై మాత్రమే ఓటింగ్ జరిగింది. టాటా సన్స్ చేసిన ఆరోపణలపై రతన్‌టాటా, టాటాసన్స్, పలువురు డైరెక్టర్లపై వాడియా రూ.3,000 కోట్ల పరువు నష్టం వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే.