ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' (Infosys) కంపెనీ షేర్లు గత ఐదు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు కూడా సంస్థ షేర్స్ రెండు శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణం ఏంటి, మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి డిసెంబర్ 22 సాయంత్రం మెమోరండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU) రద్దు చేసుకున్నట్లు ఇన్ఫోసిస్ కంపెనీ ప్రకటించిన తర్వాత సంస్థ షేర్లు పతనమవ్వడం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ ప్రకటన ముందు వరకు దూసుకెళ్లిన షేర్లు ఒక్కసారిగా పడిపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.
మూడు రోజుల వరుస సెలవుల తర్వాత డిసెంబర్ 26న(మంగళవారం) కంపెనీ ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి స్టాక్ రూ. 1,534 స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత తేరుకుని 1.08 శాతం నష్టంతో రూ. 1546 వద్ద నిలిచింది.
ఇదీ చదవండి: అప్పులపాలు.. యంత్రాలన్నీ తుప్పుపట్టి పనికిరాని దశలో.. టాటా రాకతో అంతా తారుమారు!
ఇన్ఫోసిస్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) సదరు కంపెనీ రద్దు చేసుకుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. దీంతో సంస్థ చేసుకున్న 1.5 బిలియన్ డాలర్లు లేదా సుమారు రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్ అయింది. ఈ కారణంగానే కంపెనీ షేర్స్ ప్రస్తుతం తగ్గు ముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment