సాక్షి, ముంబై: భారతీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ భారీ డీల్ నుంచి తప్పుకుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
టీసీఎస్ లాంటి థర్డ్-పార్టీ ఐటీ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఇన్‌సోర్సింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలని ట్రాన్సామెరికా యోచిస్తోందని తెలుస్తోంది. ట్రాన్సామెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో 10 సంవత్సరాల ఒప్పందం ప్రస్తుత పరిస్థితులు, సంబంధిత వ్యాపార ప్రాధాన్యతల రీత్యా గడువులోపే ముగిసిందని ధృవీకరించింది. 10 ఏళ్ల డీల్ విలువ 2 బిలియన్ డాలర్లు. ఈ డీల్‌కు ముగింపునకు ట్రాన్సామెరికా, టీసీఎస్ పరస్పరం అంగీకరించాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు)
తాజా నివేదికల ప్రకారం రానున్న 24-30 నెలల్లో ఈ ట్రాన్సిషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. కాంట్రాక్ట్ పదేళ్లలో ఎనిమిదేళ్లు పూర్తి చేస్తుందని, దీనిపై తమపై ఆర్థిక ప్రభావం తక్కువేనని టీసీఎస్ వెల్లడించింది. కాగా టీసీఎస్ సీఈవోగా రాజేష్ గోపీనాథన్ రాజీనామా తరువాత జూన్ 1న బాధ్యతలు స్వీకరించిన కె. కృతివాసన్‌కి ఇది పెద్ద సవాలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. (అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!)
ట్రాన్సామెరికా అనేది శాన్-ఫ్రాన్సిస్కో-ఆధారిత ఆర్థిక సేవల సంస్థ. 2018, జనవరిలో కుదుర్చుకున్న ట్రాన్సామెరికా డీల్ కంపెనీ అతిపెద్ద కాంట్రాక్టులలో ఒకటిగా నిలిచింది. కాగ్నిజెంట్‌తో సహా ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సేవలు పోటీ పడగా టీసీఎస్ ఈ డీల్‌ను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment