
ముంబై: రోహిత్ శర్మ తన సహరులతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లకపోవడానికి ఫిట్‌నెస్ సమస్య కారణం కాదని బీసీసీఐ కొత్తగా తేల్చి చెప్పింది. రోహిత్ విషయంలో వరుస వివాదాలు, కోహ్లి వ్యాఖ్యల నేపథ్యంలో బోర్డు బోర్డు ఇచ్చిన వివరణ ఆసక్తకరంగా మారింది. ‘తన తండ్రి అనారోగ్యంగా ఉన్న కారణంగానే రోహిత్ ఐపీఎల్ తర్వాత నేరుగా ముంబైకి వచ్చింది. ఇప్పుడు ఆయన కోలుకున్నారు కాబట్టి రోహిత్ ఎన్‌సీఏకు వెళ్లి తన రీహాబిలిటేషన్‌ను ప్రారంభించాడు’ అని బోర్డు స్పష్టం చేసింది. డిసెంబర్ 11న రోహిత్ ఫిట్‌నెస్‌ను మరోసారి సమీక్షిస్తామని పేర్కొంది.
ఇషాంత్ పూర్తిగా దూరం...
గాయంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఇషాంత్ శర్మ మిగిలిన రెండు టెస్టులనుంచి కూడా తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పక్కటెముకల గాయంనుంచి పూర్తిగా కోలుకున్నా...టెస్టు మ్యాచ్‌లు ఆడే ఫిట్‌నెస్ స్థాయిని అతను ఇంకా అందుకోలేదని బోర్డు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment