
బెంగళూరు: ఇటీవల వివాదానికి కేంద్రంగా మారిన రోహిత్ శర్మ ఫిట్‌నెస్ వ్యవహారంపై ఎట్టకేలకు నేడు స్పష్టత రానుంది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో నేడు రోహిత్‌కు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లు కూడా దీనిని పర్యవేక్షిస్తారని సమాచారం. ఫిట్‌నెస్ పరీక్షలో సఫలమైతేనే అతను ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం ఉంది. అంతా బాగుండి అత ను ఆస్ట్రేలియాకు వెళితే నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. తొలి రెండు టెస్టులకు రోహిత్ దూరం కావడం ఇప్పటికే ఖాయం కాగా... చివరి రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment