వెస్టిండీస్‌తో నాలుగో టి20కి ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. మూడో టి20 సందర్బంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడిన రోహిత్ శర్మ బ్యాటింగ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో మిగిలిన టి20లతో పాటు ఆసియాకప్‌కు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. అయితే రోహిత్ వెన్నునొప్పి నుంచి కోలుకున్నట్లు సమాచారం. శనివారం ఫ్లోరిడా వేదికగా జరగనున్న నాలుగో టి20 మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉంటాడని తెలిసింది. ఈ మేరకు రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కూడా సాధించాడు.
దీంతో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలోనే టీమిండియా మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. తొలి టి20లో టీమిండియా 68 పరుగుల తేడాతో గెలవగా.. రెండో టి20లో విండీస్ విజయం సాధించింది. ఇక మూడో టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 76 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment