సాక్షి, ముంబై: కేంద్ర కేబినెట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ మూడేళ్ల క్రితం అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. మిస్టర్‌క్లీన్‌గా పేరు న్న ఈ నాయకుడి పాలనకు సోమవారంతో మూడే ళ్లు పూర్తికానున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆదర్శ్ కుంభకోణంలో చిక్కుకుపోవడంతో ఆయనను తప్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోని యాగాంధీ ఆదేశాలతో పృథ్వీరాజ్ చవాన్‌కు ఈ అవకాశం ద క్కింది. ఇక్కడి రాజకీయాలను చవాన్ తట్టుకోలేరని, తిరిగి ఢిల్లీ వెళ్తారని వాదనలు విని పించినా ఆయన తన పాలనను కొనసాగిస్తున్నారు.
ఈ మూడేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అనేక కీలక నిర్ణయాలనూ తీసుకున్నారు. ఎన్నో విషయాల్లో ప్రతిపక్షాలు, మిత్రపక్షమైన ఎన్సీపీ నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. బిల్డర్ల అక్రమా లు, జలవనరుల కుంభకోణం, రైతుల ఆత్మహత్య లు, చక్కెర పరిశ్రమల కుంభకోణం తదితర ఆరోపణలతో చవాన్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రతి పక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. మిత్రపక్షం ఎన్సీపీ నుంచి కూడా ఆయనకు మద్దతు పెద్దగా లభించలేదు. ఈ సమస్యలన్నింటిని అధిగమిస్తూ మూడేళ్ల పదవి కాలాన్ని ఆయన పూర్తి చేశారు. రాబోయే లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే..
ఎన్సీపీకి చురకలు...
వారసత్వ రాజకీయాలను నిర్మూలిస్తామని చెప్పిన ఎన్సీపీ, లక్ష్యసాధనలో విఫలమయింది. ఈ విషయంలో దానిని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. మా కూటమి అధికారంలోకి వచ్చినా, దాని వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. రెండు పార్టీల మధ్య సమన్వయం లోపించడంతో నిర్ణయాలు తీసుకోవడంలో అడ్డంకులుగా మారడం నిజమే. ఎన్సీపీ వ్యవహారాలు గందరగోళంగా మారాయి. అయినా దానిని మా పార్టీలో విలీనం చేయాలని నేను కోరుకోవడం లేదు. అప్పట్లో చాలా మంది నాయకులు (ఎన్సీపీని ఉద్దేశించి) వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారు. ఇప్పుడు వారి వారసులే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారనేది బిహ రంగ రహస్యం.
పాలనలో జాప్యంపైనా ఆయన స్పందిం చారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. యశ్వంత్‌రావ్ చవాన్, వసంత్‌రావ్ నాయ క్ హయాంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభం గా ఉండేది. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ అధికారంలో ఉన్నాయి. రెండు పార్టీల ఆలోచనలు ఒకటే. కానీ గ్రామపంచాయతీ మొదలుకొని సాధారణ ఎన్నికల్లోనూ ఇవి పరస్పరం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి.
ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యం...
ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధికే అగ్రప్రాధాన్యం. నియమాల ఉల్లంఘనలను సహించే ప్రసక్తే లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రెండే నాకు ముఖ్యం. స్వార్థప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తాను. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి అవసరమైన పనుల్లో జాప్యాన్ని నివారిస్తాం. ఎవరి ఒత్తిళ్లకూ లొంగను.
అసెంబ్లీ ఎన్నికల్లోనే....
రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయాలని కోరుకుంటున్నా. మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లోకి వె ళ్లనున్నారా లేదా అసెంబ్లీకి పోటీ చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు పైసమాధానం చెప్పారు. కరాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించాను. అయితే 1999 లో లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ప్రజల కోసం ఎంతో చేసినా, పరాజయం పాలవడం కొంత బాధ కలిగించింది. మా అధ్యక్షురాలు సోనియాగాంధీ నన్ను రాజ్యసభకు పంపించింది. అనంతరం కరాడ్‌తోపాటు రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో కొంత దూరం పెరిగింది. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక ఆ దూరాన్ని తగ్గిం చుకున్నాను. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నా నేతృత్వంలోనే జరుగుతాయి.