successes
-
‘గత విజయాలే నాకు ప్రేరణ’
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు సాధించిన ఘనతలు, రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సహా ఐదు పతకాలు మాత్రమే కాదు... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలతో తోడు పెద్ద సంఖ్యలో బీడబ్ల్యూఎఫ్ ట్రోఫీలతో ఆమె ఎన్నో అద్భుత విజయాలతో ఆమె తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుంది. అయితే గత ఏడాది కాలంగా ఆమె కెరీర్ కాస్త ఒడిదుడుకులకు లోనవుతోంది. ఆశించిన స్థాయిలో ఆమె ప్రదర్శన ఉండటం లేదు. దాంతో 29 ఏళ్ల సింధు భవిష్యత్తుపై సందేహాలు వస్తున్నాయి. కానీ సింధు వీటన్నింటిని కొట్టిపారేసింది. ఆటలో మరింత కాలం కొనసాగే సత్తా తనలో ఉండటమే కాదు... విజయాలు సాధించాలనే తపన, ఆకలి కూడా మిగిలి ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. సరిగ్గా చెప్పాలంటే తాను సాధించిన గత విజయాలు తనకు స్ఫూర్తినిస్తాయని ఆమె పేర్కొంది. ‘మున్ముందు కెరీర్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని తపన నాలో ఇంకా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను గొప్ప విజయాలు అందుకున్న గత వీడియోలు చూస్తే ఎంతో సంతోషం కలగడమే కాదు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి కూడా. వాటిని చూస్తే చాలు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ముఖ్యంగా కొన్ని టైటిల్స్ నేను చాలా చిన్న వయసులోనే గెలుచుకున్నాను. అప్పుడు అంతా బాగా చేయగా లేనిది ఇప్పుడు చేయలేనా అనే ప్రశ్న నాలో మొదలవుతుంది. అక్కడినుంచే మళ్లీ విజయాల వేట మొదలవుతుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. కోలుకొని చెలరేగడం కొత్త కాదు... గతంలో తాను వివిధ సందర్భాల్లో వేర్వేరు కారణాలతో వెనుకబడిపోయానని, కానీ ఎప్పుడూ ఆశలు వదులుకోలేదని ఆమె వెల్లడించింది. ‘క్రీడల్లో నేను ఎంతో నేర్చుకున్నాను. గాయాలతో ఆటకు దూరమై అసలు తిరిగొస్తానో లేదో అనే సందేహాల మధ్య కూడా నాపై నేను నమ్మకం ఉంచాను. 2015లో నేను గాయపడినప్పుడు ఇలా జరిగింది. కానీ ఆ తర్వాత కోలుకొని రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచాను. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు, అవార్డులు, రివార్డులు సాధించాను. ఇన్ని గెలిచిన నేను ఎంతో అదృష్టవంతురాలిని. అవన్నీ నాతో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గెలుపోటములు ఆటలో, జీవితంలో భాగం. కష్టసమయాల్లో ఓపిగ్గా ఉండటం అనేది నేను నేర్చుకున్నాను. సరైన సమయం కోసం ఎదురు చూడటం ఎంతో ముఖ్యం’ అని సింధు విశ్లేషించింది. గడ్డు కాలం అధిగమించాను... 2024లో ఆడిన చివరి టోర్నీ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌లో విజేతగా నిలవడం మినహా గత ఏడాది సింధు చెప్పుకోగ్గ ఫలితాలు సాధించలేకపోయింది. మరో పతకం ఆశలతో బరిలోకి దిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కూడా నిరాశపర్చింది. అయితే ఇలాంటి దశను దాటి మున్ముందు మంచి విజయాలు అందుకుంటానని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ‘మనం అనుకున్న విజయాలు సాధించనప్పుడు, కోర్టులో కష్ట సాగుతున్నప్పుడు సహజంగానే బాధ వేస్తుంది. ఇలాంటప్పుడు మరింత పట్టుదలగా ఉండాలి. నేను ఎన్నో మ్యాచ్‌లలో గెలుపునకు బాగా చేరువగా వచ్చి కూడా ఓడిపోయాను. నాకు ఇలా జరుగుతోందేమిటి అని ఆలోచించిన సందర్భాలు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ గడ్డు సమయంలో మన సన్నిహితులు అండగా నిలవడం కీలకం. అప్పుడే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. నా తల్లిదండ్రులిద్దరూ క్రీడాకారులు కావడం నా అదృష్టం. గెలుపోటముల సమయంలో ఎలా ఉండాలో వారు నాకు నేర్పారు. ఇంకా సాధించాల్సింది, నిరూపించుకోవాల్సింది ఏమీ లేకపోయినా సరే ఓటములు బాధించడం సహజం. నాకు సంబంధించి ఫిట్‌గా ఉంటే నేను ఇంకా చాలా ఆడగలనని, ఎన్నో టోర్నీలు గెలవగలననే నమ్మకం ఉంది’ అని సింధు స్పష్టం చేసింది. ఫిట్నెస్ ప్రధానం... 2025లో తన ప్రణాళిక ప్రకారం ఎంపిక చేసిన టోర్నీల్లో పాల్గొంటూ ఫిట్నెస్ను కాపాడుకుంటానని సింధు వెల్లడించింది. ‘ప్రతీ నెలలో పెద్ద సంఖ్యలో టోర్నమెంట్లు జరుగుతాయి. దాదాపు 15–20 రోజులు బయటే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి టోర్నిలను ఎంపిక చేసుకొని బరిలోకి దిగుతాను. పూర్తి ఫిట్నెస్తో ఉంటేనే వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలం. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఆడాల్సిన టోర్నీలు కాకుండా మిగతా వాటిలో కొన్నింటిని ఆటగాళ్లు ఎంచుకోవడం సహజం. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరో పతకం, ఆల్ ఇంగ్లండ్‌లో పతకం గెలవడం నా ప్రణాళికల్లో ఉన్నాయి. ఎన్ని గెలిచినా మైదానంలో దిగగానే ఎవరైనా ఇంకా గెలవాలనే కోరుకుంటారు’ అని ఆమె చెప్పింది. ఇంకా నేర్చుకుంటున్నా... ఇన్నేళ్ల కెరీర్ తర్వాత ఇంకా తాను ఆటలో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని... ఆటలో వస్తున్న కొత్త మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటున్నానని సింధు పేర్కొంది. ‘బ్యాడ్మింటన్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్లేయర్ల డిఫెన్స్ చాలా దుర్బేధ్యంగా మారుతోంది. దానిని బద్దలు కొట్టాలంటే మరింత శ్రమించాలి. ప్రతీసారి అటాక్ చేసే అవకాశం అందరికీ రాదు. ముఖ్యంగా నేను ఎత్తుగా ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా అటాక్ చేయకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారు. నా డిఫెన్స్ కూడా మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. భారత బ్యాడ్మింటన్‌లో నా తర్వాత ఎంతో మంది యువ తారలు వేగంగా దూసుకొస్తున్నారు. ఉన్నతి, మాళివకల ఆట బాగుంది. వారికి సరైన మార్గనిర్దేశనం లభిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సింధు అభిప్రాయపడింది. కొత్త కోచ్ అండగా... సింధు కొత్త సీజన్లో కొత్త కోచ్ శిక్షణలో బరిలోకి దిగనుంది. ఇండోనేసియాకు చెందిన ఇర్వాన్స్యా ఆది ప్రతమ ఆమెకు ఇకపై కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని సింధు ఖరారు చేసింది. గత కొద్ది రోజులుగా బెంగళూరులో ప్రతమ పర్యవేక్షణలో సింధు సాధన చేస్తోంది. నేటి నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ వీరిద్దరి భాగస్వామ్యంలో తొలి టోర్నీ కానుంది. ‘కోచ్, ప్లేయర్ మధ్య సమన్వయం ఎంతో ముఖ్యం. అది కుదిరేందుకు కొంత సమయం పడుతుంది. మరికొన్ని ప్రాక్టీస్ సెషన్ల తర్వాత ఒకరిపై మరొకరికి స్పష్టమైన అవగాహన రావచ్చు. ప్రతమ గురించి చాలా విన్నాను. నాకు సరైన కోచ్‌గా అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని సింధు వెల్లడించింది. -
పని చెయ్యడం ఒక వేడుక
ఫలితం రావడానికి పనిచెయ్యడం ప్రాతిపదిక. ప్రయత్నం పని చెయ్యడానికి ప్రాతిపదిక. ఏ పరిణామానికైనా ప్రయత్నం, పని చెయ్యడం ఉండాలి. ప్రయత్నంతో పని చెయ్యడానికి మనిషి పూనుకోవాలి; ప్రయోజనకరమైన ఫలితాలను సాధించాలి. ‘తప్పులు జరుగుతాయన్న భయంతో పని మొదలు పెట్టక΄ోవడం చెడ్డవాడి లక్షణం; అజీర్ణం అవుతుందనే భయంవల్ల భ్రాంతిలో ఎవరు భోజనాన్ని వదిలేస్తారు? అని హితోపదేశం మాట. తప్పులు జరుగుతాయని పని చెయ్యక΄ోవడం నేరం. పని చెయ్యడం గురించి ఓషో ఇలా చె΄్పారు... జీవితం అన్నది బాధ్యతలతో మాత్రం పని చెయ్యడమా? లేదా వేడుకలోపాలుపంచుకోవడమా? పని చెయ్యడం మాత్రమే జీవితం అయితే జీవితం ఇబ్బందికరమైనదై ఇరుకైందిగా మారి΄ోతుంది. బరువెక్కిన హృదయంతో జీవించాల్సి వస్తుంది. కృష్ణుడు పని చెయ్యడం మాత్రమే బాధ్యత గా జీవించినవాడు కాదు. జీవితాన్ని ఒక వేడుకగా; ఒక ఉత్సవంగా మార్చుకున్నవాడు. జీవితం ఇంట్లో చదువుకునేపాఠం కాదు. జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చుకోవడం వల్ల ఎవరూ జీవితాన్ని కోల్పోవడం లేదు. పని చెయ్యి; ఆ పనిని వేడుకలాగా మార్చెయ్యి. అప్పుడు పని కూడా ఆటపాటల సంకలనంగా మారి΄ోతుంది. అందువల్ల చిన్నపని కూడా నిండుగా ఉంటుంది. పని సౌందర్యాత్మకం అవుతుంది. పనికి బానిసలుగా మారినవాళ్ల గురించి మీకు తెలిసి ఉంటుంది. పని చెయ్యడం కోసం జీవించేవాళ్లు ఉద్రిక్తతలో జీవించాల్సి వస్తుంది. పని పిచ్చివాళ్లైనవాళ్లు జీవించడాన్ని ఒక కర్మాగారంగా మార్చేసు కుంటున్నారు.‘చెయ్యి లేదా చచ్చి΄ో‘ అని ఘోషిస్తున్నారు. పని చెయ్యడం తప్పితే మరో కోణం వాళ్లకు తెలీదు. వాస్తవానికి వాళ్లకు పని చెయ్యడానికి ప్రయోజనం ఏమిటో తెలియదు. జీవితం అన్నది ఒక వేడుక. మనం పని చెయ్యడం నాట్యం చేస్తున్నట్టు ఉండాలి. పని చెయ్యడం ద్వారా వేడుకను తీసుకురావాలి. కఠినమైన జీవితాన్ని తలుచుకుంటూ ఉంటేపాడడానికీ, ఆడడానికీ, వేడుక చేసుకోవడానికీ సమయం లేకుండా ΄ోతుంది. జీవితం ఇంటికీ, కార్యాలయానికీ మధ్యలో ఆగి΄ోతుంది. ఈ రెండు ప్రదేశాల మధ్యలో ముళ్లకంచెను ఏర్పరుచుకుని మానసికంగా మీరు బాధకు గురి అవుతున్నారు. ఒకరోజున జీవితంలో విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించాలని మీరు అనుకుంటారు. కానీ ఆ రోజు రాదు; పని పిచ్చివాళ్లు ఎప్పటికీ జీవితాన్ని వేడుక చేసుకోరు. కృష్ణుడు జీవితాన్ని ఉత్సవంగా మార్చుకున్నాడు. పువ్వులు, పక్షులు, ఆకాశ తారలు జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. మనిషి తప్పితే జీవరాశులన్నీ జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. పువ్వులు ఎందుకు పూస్తూ ఉన్నాయి? అని అడగండి. తారలు ఎందుకు ఆకాశంలో తేలుతున్నాయి? అని అడగండి. గాలి ఎందుకు ఒంటరిగా వీస్తోంది? అని అడగండి. సూర్యుడికి కింద జీవిస్తున్నవి అన్నీ వేడుక చేసుకుంటున్నాయి. ప్రపంచమే వేడుక చేసుకుంటోంది. మనిషి కూడా ప్రపంచంలో భాగమే అని కృష్ణుడు చెబుతున్నాడు; వేడుక చేసుకోండి అని చెబుతున్నాడు. ఏ పనీ చెయ్యకుండా వేడుక చేసుకోమని కృష్ణుడు చెప్పలేదు. గాలి పని చెయ్యకుండా వీచడం లేదు. తార ఒకేచోట నుంచుని వేడుక చేసుకోవడంలేదు. అది కదులుతూనే ఉంది. పువ్వులు పుయ్యడం కూడా పనే. అయితే వీటికి పని చెయ్యడం ముఖ్యం కాదు. వేడుక ముఖ్యం. వేడుక ముందు ఉంటుంది అదే సమయంలో అవి తమ బాధ్యతల్ని కూడా నెరవేరుస్తాయి. వేడుకకు కొనసాగింపే పని; జీవితమే ఒక ఉత్సవం. పని చెయ్యడంలోని సౌందర్యాన్ని, పని చెయ్యడంవల్ల సత్ఫలితాన్ని మనిషి సొంతం చేసుకోవాలి. పని చేస్తూ మనిషి తన జీవితాన్ని ఉత్సవం చేసుకోవాలి. – శ్రీకాంత్ జయంతి -
పల్స్ పోలియో విజయవంతం
-
ఇంకా సాధించాల్సింది ఉంది!
‘‘ఈ మధ్య కాలంలో నాకు సరైన విజయాలు రాలేదన్న మాట నిజమే. ‘వీడికి దూకుడెక్కువ’ సినిమా మాత్రం ఆ లోటు తీరుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. సత్యం ద్వారపూడి దర్శకత్వంలో శ్రీకాంత్, కామ్నా జెత్మలానీ జంటగా బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ‘వీడికి దూకుడెక్కువ’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ - ‘‘నా కెరీర్లో ‘ది బెస్ట్’ సినిమా ఇది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. పరిశ్రమకు వచ్చి చాలా కాలమైనా ఇంకా సముద్రంలో ఈదుతున్నట్టే ఉంది. ఇంకా సాధించాల్సింది ఉంది. ప్రస్తుతం హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఓ హారర్ చిత్రంలో నటిస్తున్నా. ‘అమ్మ’ రాజశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇక మా అబ్బాయి రోషన్ సంగతంటారా! తను ఇంకా చిన్నపిల్లాడే. వాడి భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుంది. మొన్నీ మధ్యే ‘రుద్రమదేవి’లో నటించాడు. ప్రస్తుతం ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. హీరోగా వాడు పెద్ద స్థాయికి చేరుకుంటాడా లేదా అన్నది వాడి అదృష్టమే’’ అని చెప్పుకొచ్చారు. -
వివాదాలతో రాటుదేలా !
సాక్షి, హైదరాబాద్: గ్రాండ్‌స్లామ్ గెలుపు... డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టైటిల్... మరో రెండు టైటిల్స్...ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్యాలు... హైదరాబాదీ సానియామీర్జా కెరీర్లో ఇదో అద్భుత సంవత్సరం. విజయంతో సీజన్‌ను ముగించిన భారత టెన్నిస్ స్టార్, దశాబ్ద కాలపు అంతర్జాతీయ కెరీర్ తర్వాత కూడా కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన సానియా మంగళవారం తన అకాడమీలో మీడియాతో మాట్లాడింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకుంటానంటున్న మీర్జా చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... 2014లో ప్రదర్శన: అంతర్జాతీయ సర్క్యూట్లో ఒక టెన్నిస్ ప్లేయర్ ఏడాది కాలంలో ఏఏ విజయాలు సాధించాలని కోరుకుంటారో నాకు అవన్నీ దక్కాయి. నిజంగా ఈ ఏడాది అద్భుతంగా సాగింది. 2013 సీజన్ చివర్లో కూడా నేను సంతృప్తి వ్యక్తం చేశాను. అయితే తర్వాతి సంవత్సరం ఇంత బాగుంటుందని నాడు నేను కూడా ఊహించలేదు. టోర్నీ టైటిల్సే కాకుండా ఆసియా క్రీడల్లో వచ్చిన పతకాలు కూడా ఎంతో సంతోషాన్నిచ్చాయి. అన్నింటికి మించి డబ్ల్యూటీఏ ఫైనల్స్ గెలవడం అంటే నా దృష్టిలో ప్రపంచ విజేతగా నిలిచినట్లే. ఆటగాళ్ల స్థాయి, పోటీతో పోలిస్తే గ్రాండ్స్లామ్కంటే కూడా ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే నా కెరీర్లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్కంటే ఇదే పెద్ద విజయం. నా అదృష్టాన్ని నేను రాసుకునే అవకాశం ఉంటే ఇలాగే రాసేదాన్నేమో! టోర్నీ సెమీస్, ఫైనల్లో ప్రదర్శన: సెమీస్‌లో విజయం అనూహ్యం. రెండో సెట్లో మ్యాచ్ పాయింట్‌కు ముందు గెలుపుపై ఆశలు వదిలేసుకున్నాం. చివరి ప్రయత్నం అనుకొని సర్వీస్ చేశాను. ర్యాలీ అనంతరం నా రిటర్న్‌ను అనూహ్యంగా ఆమె వదిలేసింది. సాధారణంగా అలాంటి పాయింట్లు మనకు లభించవు. కానీ అదృష్టం కలిసొచ్చింది. స్కోర్లు సమం చేయడంతో పాటు దూసుకెళ్లి మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాం. ఫైనల్‌కు ముందు మాత్రం ఆందోళన చెందలేదు. ఓడినా ఫర్వాలేదనుకున్నాం. పైగా ప్రత్యర్థుల ఫైనల్ రికార్డు బాగుంది. వాళ్లు ఏకంగా 12 ఫైనల్స్‌లో ఓటమిని చూడలేదు. అందరూ అదే చెప్పారు. కానీ అనూహ్యంగా మేం వారిని చిత్తుగా ఓడించాం. కారాబ్లాక్‌తో విడిపోవడం: ఇదేమీ మా ఇద్దరికీ పడలేదనో, భేదాభిప్రాయాల వల్లనో విడిపోవడం లేదు. ఇంత గొప్ప విజయం మాకు ఆఖరిది కావడం బాధగా ఉంది. ఆట మాత్రమే కాకుండా ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా కోరుకుంటోంది. దానిని నేను గౌరవిస్తాను. కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు నా కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నాను కాబట్టి మరో భాగస్వామితో కొనసాగాలి. సీ సు వీ (చైనీస్ తైపీ)తో తొలిసారి ఆడబోతున్నాను. ఆమె అత్యుత్తమ డబుల్స్ ప్లేయర్. వచ్చే ఆడాది ఆమెతో కలిసి కూడా బాగా ఆడతాననే నమ్మకముంది. ఓవరాల్‌గా కెరీర్‌పై: నాకు టెన్నిస్ ఆడటం తప్ప మరొకటి తెలీదు. విజయం సాధించేందుకు ఎలాంటి రహస్యాలు ఉండవు. ఒక్కసారిగా అద్భుతాలు కూడా జరగవు. కష్టపడటం ఒక్కటే మార్గం. గత 21 ఏళ్లుగా నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు కూడా మరో దాని గురించి ఆలోచించడం లేదు. వైఫల్యాలు ఎదురైనప్పుడు మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఇటీవలి విమర్శలు: నిజాయితీగా చెప్పాలంటే వివాదాలను రేపిన వారికి నా కృతజ్ఞతలు! ఎందుకంటే ఇవి నన్ను మరింతగా రాటుదేల్చాయి. మ్యాచ్‌లో పోరాడటమే ఇప్పటి వరకు నాకు తెలుసు. ఇప్పుడు బయట ఎలా పోరాడాలో కూడా తెలిసింది. కఠిన సమయాల్లో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకున్నాను. అయితే ఇదేమీ నాకు మొదటిసారి కాదు. ఏళ్లుగా సాగుతూనే ఉంది. అయితే ఆ కొంతమందిని తప్పిస్తే దేశమంతా నాకు బహిరంగంగా అండగా నిలిచింది. నా విజయాలతో ప్రజలంతా సంతోషించారనేది వాస్తవం. వచ్చే సీజన్‌పై: సీజన్ ముగిసింది కాబట్టి ప్రస్తుతం కొంత విరామం లభించింది. దీనిని విశ్రాంతికే కేటాయిస్తాను. అయితే డిసెంబర్లోనే ఐపీటీఎల్ జరుగుతోంది కాబట్టి మళ్లీ ఆట మొదలు పెట్టాల్సి ఉంది. ఈ టోర్నీ గొప్ప ఆలోచన. టెన్నిస్‌కు ఇప్పటికే గుర్తింపు ఉంది. ఈ టోర్నీ వల్ల దాని స్థాయి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నా. ఇక అంతర్జాతీయ సర్క్యూట్లో చూస్తే డబ్ల్యూటీఏ విజయంతో పెద్ద ఘనత దక్కింది. కాబట్టి నా తదుపరి లక్ష్యం ప్రపంచ నంబర్‌వన్ కావడమే. వచ్చే ఏడాది దానిపై దృష్టి పెట్టాను. ఇటీవల నా ప్రదర్శన చూస్తే నేను దానికి చేరువలో ఉన్నాననే భావిస్తున్నా. రాష్ట్రపతి అభినందనలు న్యూఢిల్లీ: డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ నెగ్గిన భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకంగా అభినందించారు. సానియా విజయం పట్ల తాను చాలా గర్వపడుతున్నానని, మన దేశంలోని యువతకు ఈ గెలుపు స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి అన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఘనతలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
వివాదాలు, విజయాలు
సాక్షి, ముంబై: కేంద్ర కేబినెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ మూడేళ్ల క్రితం అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. మిస్టర్క్లీన్గా పేరు న్న ఈ నాయకుడి పాలనకు సోమవారంతో మూడే ళ్లు పూర్తికానున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆదర్శ్ కుంభకోణంలో చిక్కుకుపోవడంతో ఆయనను తప్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోని యాగాంధీ ఆదేశాలతో పృథ్వీరాజ్ చవాన్‌కు ఈ అవకాశం ద క్కింది. ఇక్కడి రాజకీయాలను చవాన్ తట్టుకోలేరని, తిరిగి ఢిల్లీ వెళ్తారని వాదనలు విని పించినా ఆయన తన పాలనను కొనసాగిస్తున్నారు. ఈ మూడేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అనేక కీలక నిర్ణయాలనూ తీసుకున్నారు. ఎన్నో విషయాల్లో ప్రతిపక్షాలు, మిత్రపక్షమైన ఎన్సీపీ నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. బిల్డర్ల అక్రమా లు, జలవనరుల కుంభకోణం, రైతుల ఆత్మహత్య లు, చక్కెర పరిశ్రమల కుంభకోణం తదితర ఆరోపణలతో చవాన్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రతి పక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. మిత్రపక్షం ఎన్సీపీ నుంచి కూడా ఆయనకు మద్దతు పెద్దగా లభించలేదు. ఈ సమస్యలన్నింటిని అధిగమిస్తూ మూడేళ్ల పదవి కాలాన్ని ఆయన పూర్తి చేశారు. రాబోయే లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే.. ఎన్సీపీకి చురకలు... వారసత్వ రాజకీయాలను నిర్మూలిస్తామని చెప్పిన ఎన్సీపీ, లక్ష్యసాధనలో విఫలమయింది. ఈ విషయంలో దానిని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. మా కూటమి అధికారంలోకి వచ్చినా, దాని వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. రెండు పార్టీల మధ్య సమన్వయం లోపించడంతో నిర్ణయాలు తీసుకోవడంలో అడ్డంకులుగా మారడం నిజమే. ఎన్సీపీ వ్యవహారాలు గందరగోళంగా మారాయి. అయినా దానిని మా పార్టీలో విలీనం చేయాలని నేను కోరుకోవడం లేదు. అప్పట్లో చాలా మంది నాయకులు (ఎన్సీపీని ఉద్దేశించి) వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారు. ఇప్పుడు వారి వారసులే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారనేది బిహ రంగ రహస్యం. పాలనలో జాప్యంపైనా ఆయన స్పందిం చారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. యశ్వంత్రావ్ చవాన్, వసంత్‌రావ్ నాయ క్ హయాంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభం గా ఉండేది. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ అధికారంలో ఉన్నాయి. రెండు పార్టీల ఆలోచనలు ఒకటే. కానీ గ్రామపంచాయతీ మొదలుకొని సాధారణ ఎన్నికల్లోనూ ఇవి పరస్పరం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యం... ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధికే అగ్రప్రాధాన్యం. నియమాల ఉల్లంఘనలను సహించే ప్రసక్తే లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రెండే నాకు ముఖ్యం. స్వార్థప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తాను. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి అవసరమైన పనుల్లో జాప్యాన్ని నివారిస్తాం. ఎవరి ఒత్తిళ్లకూ లొంగను. అసెంబ్లీ ఎన్నికల్లోనే.... రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయాలని కోరుకుంటున్నా. మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లోకి వె ళ్లనున్నారా లేదా అసెంబ్లీకి పోటీ చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు పైసమాధానం చెప్పారు. కరాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించాను. అయితే 1999 లో లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ప్రజల కోసం ఎంతో చేసినా, పరాజయం పాలవడం కొంత బాధ కలిగించింది. మా అధ్యక్షురాలు సోనియాగాంధీ నన్ను రాజ్యసభకు పంపించింది. అనంతరం కరాడ్తోపాటు రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో కొంత దూరం పెరిగింది. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక ఆ దూరాన్ని తగ్గిం చుకున్నాను. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నా నేతృత్వంలోనే జరుగుతాయి.