మా పార్టీని గౌరవిస్తేనే పొత్తు | Congress, NCP battle it over seat-sharing ahead of poll fight | Sakshi
Sakshi News home page

మా పార్టీని గౌరవిస్తేనే పొత్తు

Published Thu, Jul 24 2014 11:43 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

Congress, NCP battle it over seat-sharing ahead of poll fight

ముంబై: కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తేనే ఎన్‌సీపీతో పొత్తు ఉంటుందని, లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ‘ఆత్మగౌరవంపై మేము రాజీ పడే ప్రసక్తే లేదు. మాకు గౌరవం దక్కనట్లయితే.. మేము కూటమిలో కొనసాగలేం. సొంతంగానే పోరాడతాం’ అని గురువారం చవాన్ వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకునేందుకు ఎన్‌సీపీ అంగీకరించని నేపథ్యంలో చవాన్ పైవిధంగా స్పందించారు. మహారాష్ట్రలో అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉంటే.. అందులో సగం అంటే 144 సీట్లు ఇవ్వాలని ఎన్‌సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి వరకూ ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలు అసంతప్తిగా ముగిశాయి.

 

దీనిపై ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్‌ను ప్రశ్నించగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం బలహీనంగా ఉన్న కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేస్తే అది బీజేపీ-శివసేనలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్‌సీపీతో పొత్తు ఉన్నా లేకున్నా.. ఆగస్టు 7 నాటికి అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేస్తామని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement