సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందని కాంగ్రెస్ నేత మర్రిశశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఓటర్ లిస్టులో పొరపా ట్లు జరిగాయని ఎన్నికల సంఘం చెప్పిందని, ఆ తప్పులకు ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మర్రి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘానికి సరైన ఓటర్ లిస్ట్ తయారు చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు. అధికార పార్టీకి ఎన్నికల సంఘం అనుకూలంగా పని చేసినందుకే సీఎం కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారా అని అడిగారు. గుణాత్మక మార్పు అంటూ కొన్ని రాజకీయ పార్టీలను కలిసిన కేసీఆర్‌పై, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో ఆ పార్టీలకు లేఖలు రాస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఇప్పటి వరకు 30 లక్షల ఓట్లను తొలగించిందని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment