
సమావేశంలో మాట్లాడుతున్న శశిధర్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి : అధికార పార్టీ ఒత్తిళ్లతో తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నల్లగొండ జిల్లా ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని బూత్ లెవెల్ ఆఫీసర్స్ వద్దకు వెళ్లి ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగకుండా చూడాలన్నారు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి పార్టీ సానుభూతిపరులతో పాటు అర్హులైన అందరి పేర్లు నమోదు చేయించాలన్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అ«ధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, కమిటీ సభ్యులు ఉన్నారు.