(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం లక్డీకపూల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని సంస్థాగత లోపాలు గుర్తించాలని, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమే తీసుకుంటుందని తెలిపారు.
రేపటి ఎన్నికలు పార్టీ మనుగడకు చాలా కీలమని శశిధర్‌రెడ్డి తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో ఓడిపోయాం, హుజురాబాద్‌లో కూడా ఓడామని, అటువంటి పరిస్థితి తెలంగాణలో రాకూడనే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇది అసమ్మతి సమావేశం కాదు.. బాధ్యత గల నేతలుగా తాము సమావేశమయ్యామని తెలిపారు. గత మూడేళ్లుగా సమావేశం అవుతూనే ఉన్నామని తెలిపారు. ఇది మొదటి, చివరి సమావేశం కాదని ఆయన గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment