సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కేన్సర్ వచ్చిందంటూ మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు చేయడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉన్నాయని, అయినా బీజేపీలో చేరాలనుకునేవారికి కాంగ్రెస్ పార్టీని నిందించే హక్కులేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఎవరికైనా పార్టీ నుంచి వెళ్లిపోయే స్వేచ్ఛ ఉంటుంది కానీ పార్టీని విమర్శించే హక్కు ఉండదని పేర్కొన్నారు. 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఎంతో మంది వచ్చారని, ఎంతో మంది వెళ్లిపోయారని, ఎవరు ఎలాంటి వారో, ఏ పార్టీ ఎలాంటిదో భవిష్యత్తులో తేలిపోతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment