
గోదావరి ప్రాజెక్టుల వివరాలు తెలపాలి
గోదావరి జలాలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల వివరాలను ప్రజా క్షేత్రం లో పెట్టాలని ఫోరం ఫర్ యుటిలైజేషన్ ఆఫ్ గోదావరి
మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల వివరాలను ప్రజా క్షేత్రం లో పెట్టాలని ఫోరం ఫర్ యుటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా, ఎవరితో చర్చించకుండా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని మండిపడ్డారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపిస్తోందన్నారు. బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు ప్రాజెక్టులకు కేటాయించినా, అసెంబ్లీలో ఒక్క నిమిషం కూడా చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తయితే తొలుత తామే సంతోషపడతామని పేర్కొన్నారు.