
అడవుల్లో పర్యటించిన డీజీపీ
సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై దృష్టి పెట్టిన ప్రభుత్వం కొత్త వాటి నిర్మాణం విషయంలోనూ ఇదే తీరుగా ....
► తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీస్ స్టేషన్
► ఏటూరునాగారం మండలం
► తుపాకులగూడెం వద్ద నిర్మాణం
► ప్రాజెక్టుల వేగవంతమే ప్రభుత్వ లక్ష్యం
► మావోయిస్టుల ప్రభావం లేకుండా చర్యలు
► అడవుల్లో పర్యటించిన డీజీపీ అనురాగ్‌శర్మ
ఏటూరునాగారం :సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై దృష్టి పెట్టిన ప్రభుత్వం కొత్త వాటి నిర్మాణం విషయంలోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తోంది. కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. గోదావరి నదీ తీరం వెంటనిర్మించబోయే ప్రాజెక్టులకు మావోయిస్టుల నుంచి ఇబ్బంది లేకుండా చేసేందుకు పోలీసు శాఖ రంగంలోకి దిగింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం తుపాకులగూడెం ప్రాంతంలో అటాకింగ్ పోలీస్ స్టేషన్ నిర్మించనున్నారు. పోలీసు రాష్ట్ర ఉన్నతాధికారి(డీజీపీ) అనురాగ్‌శర్మ ఈ ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు.
దేవాదుల ప్రాజెక్టుకు నాలుగు కిలో మీటర్ల దూరంలోని గుట్టలగంగారం, తుపాకులగూడెం ప్రాంతంలోని భూములను ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. పోలీస్ అటాకింగ్ స్టేషన్ నిర్మాణానికి అనువైన స్థలం ఐదు ఎకరాలను గుర్తించారు. తుపాకులగూడెం, దేవాదుల, గుట్టలగంగారం ప్రాంతాలో 72 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపై రెండు ఎకరాల స్థలంలో అటాకింగ్ పోలీస్‌స్టేషన్ కోసం రెండు అంతస్తుల భవనం నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పోలీస్ హౌసింగ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు