'కేసీఆర్ నుంచి గవర్నర్ వివరణ కోరాలి'
హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్మాణంపై గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివరించనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా గవర్నర్ కూడా ముఖ్యమంత్రిని పిలిచి రిజిర్వాయర్ ఎందుకు నిర్మిస్తున్నారో వివరణ కోరాలని తెలిపారు. మల్లన్నసాగర్ అనవసరం అనే అంశంపై కేసీఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్, హరీష్ లు బాధ్యత వహించాలన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై కేసీఆర్ అవివేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిపుణుల సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా మల్లన్నసాగర్‌ను నిర్మించి దాని ద్వారా నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లను కూడా నింపుతామనటం అనాలోచిత చర్య అని విమర్శించారు.