
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ చెప్పుచేతల్లో ఎన్నికల సంఘం (ఈసీ) పనిచేస్తోందని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వ్యవహారశైలి చూస్తుంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయా? అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తోందని, ఓటర్ల జాబితాను తిమ్మినిబమ్మిని చేస్తూ మొండిగా ముందుకెళ్తోందని మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణలపై కోర్టులో దాఖలు చేసిన నాలుగో అఫిడవిట్ గురువారం విచారణకు వస్తుందని మర్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment